Kamal Haasan : ఖైరతాబాద్ గణేష్ ముందు కమల్ హాసన్ డాన్స్ చేశారని మీకు తెలుసా.?

హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో అందరికి తెలుసు. ఏడాదికి ఒక అడుగు ఎత్తు పెంచుతూ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 70 ఏళ్ళు కావడంతో 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని నిర్మించారు.

Kamal Haasan : ఖైరతాబాద్ గణేష్ ముందు కమల్ హాసన్ డాన్స్ చేశారని మీకు తెలుసా.?
Khairatabad Ganesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2024 | 6:29 PM

తెలంగాణలోని అతిపెద్ద గణేష్ విగ్రహం ఏది.? అని చిన్న పిల్లాడిని అడిగిన చెప్పేస్తాడు. అది ఖైరతాబాద్ గణేష్ అని చెప్తాడు. హైదరాబాద్ ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో అందరికి తెలుసు. ఏడాదికి ఒక అడుగు ఎత్తు పెంచుతూ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి 70 ఏళ్ళు కావడంతో 70 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని నిర్మించారు. నేడు నిమర్జన మహోత్సవం సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణనాధుడు గంగమ్మ ఒడికి చేరిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ గణేష్ నిమర్జనం పూర్తయ్యింది. భారీ వినాయకుడి నిమర్జనానికి తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. పదకొండు రోజులు పూజలందుకున్న వినాయకుడు నేడు గంగమ్మ ఒడికి చేరారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ ఖైరతాబాద్ గణేష్ ముందు డాన్స్ చేసిన విషయం మీకు తెలుసా.?

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

అవును ఖైరతాబాద్ గణేష్ ముందు కమల్ హాసన్ అద్భుతమైన డాన్స్ చేశారు. ఓ సినిమా కోసం కమల్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేశారు. ఆ సినిమానే సాగరసంగమం. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కమల్ ఓ క్లాసిక్ డాన్సర్ గా నటించారు. ఒక సన్నివేశంలో కమల్ హాసన్ వినాయకుడి విగ్రహం ముందు డాన్స్ చేస్తూ కనిపిస్తారు. ఆ వినాయకుడు మన ఖైరతాబాద్ గణేషుడే..

ఇది కూడా చదవండి : Sunil Wife: సునీల్ భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

1983లో ఖైరతాబాద్ విగ్రహం ముందు సాగరసంగమం సినిమా కోసం కమల్ డాన్స్ చేశారు. అయితే సాగర సంగమం సినిమా ఆ ఏడాది వినాయక చవితి కంటే ముందే రిలీజ్ అయ్యింది. ఆ ఏడాది సెప్టెంబర్ లో వినాయక చవితి ఉండటంతో సినిమా కోసం ముందుగానే ఖైరతాబాద్ వినాయక విగ్రహం రెడీ చేశారని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేషుడు.. ఈ ఏడాది ఏకంగా 70 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చాడు.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.