Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అప్పుడు ఫేమస్ స్పోర్ట్స్ యాంకర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. న్యూస్ ప్రజెంటర్‌గా, స్పోర్ట్స్ యాంకర్ గా పలు ఫేమస్ ఛాన్స్ లో పని చేసింది. అదే క్రేజ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టి సక్సెస్ అయ్యింది.

Tollywood: అప్పుడు ఫేమస్ స్పోర్ట్స్ యాంకర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Apr 05, 2025 | 10:59 AM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ట్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలామంది కెరీర్ ప్రారంభంలో వివిధ రకాల ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇంటర్మీడియెట్ వరకు సైన్స్ స్టూడెంట్. కానీ డిగ్రీలో అనూహ్యంగా ఫిలాసఫీ ఆర్ట్స్ సబ్జెక్టును తీసుకుంది. చిన్నప్పటి నుంచే ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొన్న ఈ క్యూటీ న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. జీ న్యూస్, న్యూస్ ఎక్స్ వంటి పలు ఫేమస్ ఛానెల్స్ లో న్యూస్ ప్రజెంటర్ గా, స్పోర్ట్స్ యాంకర్ గా విధులు నిర్వహించింది. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగు పెట్టి సక్సెస్ అయ్యింది. మొదట పంజాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్ లో నందమూరి కల్యాణ్ రామ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లతో ఆడి పాడింది. ఆ మధ్యన కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతోంది. ఇటీవలే పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి శంకర్ తో కలిసి ఓ సినిమాలో కలిసి నటించింది. అలా స్పోర్ట్స్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా బిజీగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు శ్రతి సోధి. అదే నండి కల్యాణ్ రామ్ పటాస్ హీరోయిన్.

పటాస్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సుప్రీమ్ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్రంలో ప్రియ పాత్రలో మెరిసింది. పంజాబీ, హిందీ సినిమాల్లోనూ మెరిసిన ఈ సొగసరి 2017-2023 మధ్య ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే 2023లో ఓ హిందీ సినిమాలో తళుక్కుమంది. ఇక ఇటీవలే ఒక పథకం ప్రకారం అనే తెలుగు సినిమాలో తళుక్కుమంది. ఇందులో శ్రుతి సోధితో పాటు సాయిరాం శంకర్, సముద్రఖని, అషిమా నర్వాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

ఇవి కూడా చదవండి

శ్రుతి సోధి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది శ్రుతి సోధి. తన లేటెస్ట్ అండ్ గ్లామరస్ ఫొటోలను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తరచూ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోలు నెటిజన్లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

గతంలో న్యూస్ ప్రజెంటర్ గా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.