Tamannaah: తమన్నాతో నన్ను పోల్చడం నాకు నచ్చట్లేదు.. ఆమెతో ఎలాంటి విభేదాలు లేవు.. ధురంధర్ బ్యూటీ..
పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ తమన్నా. ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు హిందీలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఓ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా ధురంధర్. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన ఈ మూవీ అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఈ మూవీతో సారా అర్జున్, విలన్ అక్షయ్ ఖన్నా ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. అలాగే ఇందులో షరారత్ అనే స్పెషల్ పాటలో నటించిన హీరోయిన్ ఆయేషా ఖాన్ సైతం ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇందులో ఆమె చేసిన డ్యాన్స్ సెప్పులకు అడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆమెను నోరా ఫతేహి, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లతో పోలుస్తున్నారు. తాజాగా తనను వారిద్దరితో పోల్చడంపై రియాక్ట్ అయ్యింది ఆయేషా. తనను వాళ్లతో పోల్చడం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Krishnavamshi : నేను తీసిన సినిమాల్లో ఆ రెండే చెత్త సినిమాలు.. డైరెక్టర్ కృష్ణవంశీ..
తమన్నా, నోరా ఫతేహిలతో తనను పోలుస్తూ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారని తెలిపింది. కానీ వారిద్దరితో తనను పోల్చడం తనకు నచ్చట్లేదు అని అంటుంది. ఇద్దరూ అద్భుతమైన మహిళలు అని.. నోరా స్టేజీ ఫెర్మార్మెన్స్, ఎనర్జ చూస్తుంటే తనకు ఎప్పుడూ ఆశ్చర్యమేస్తుందని.. తను చేసేది ఎప్పటికీ చేయలేనని తెలిపింది. ఇక తర్వాత తమన్నా గురించి మాట్లాడుతూ.. ఆమె చాలాకాలంగా ఇండస్ట్రీలో ఉందని.. ఇటీవల ఆజ్ కీ రాత్ పాటలో ఆమెను చూసి తాను కూడా ఫిదా అయిపోయానని తెలిపింది. ఇండస్ట్రీకి ఇప్పుడిప్పుడే వచ్చానని.. ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Actress : మల్లీశ్వరీ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది.. నటి కామెంట్స్..
అలాగే ధురంధర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన క్రిస్టల్ తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రమే అని. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆయేషా ఖాన్.. తెలుగులో ముఖచిత్రం, ఓం భీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అందంలో రాజహంస.. 47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్.. ఆత్మస్థైర్యానికి నిలువెత్తు రూపం..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Love Song : నిజంగా ఏం పాట బాసూ.. 1999 నుంచి ట్రెండింగ్.. ప్రేమికులకు చాలా స్పెషల్ సాంగ్..
