Dhanush: “నేనే వస్తున్నా” అంటూ రంగంలోకి దిగుతున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయిన్ ఉన్న విషయం తెలిసిందే..  ఆయన సినిమాలు తమిళ్ తోపాటు తెలుగులోనూ డబ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.

Dhanush: నేనే వస్తున్నా అంటూ రంగంలోకి దిగుతున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్
Danush
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2022 | 12:13 PM

తమిళ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులోనూ మంచి ఫాలోయిన్ ఉన్న విషయం తెలిసిందే..  ఆయన సినిమాలు తమిళ్ తోపాటు తెలుగులోనూ డబ్ అవుతూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పటికే తెలుగు ధనుష్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యారు ధనుష్. ఈ క్రమంలో విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్.

ఈ సినిమా “నానే వరువన్” ఈ చిత్రం తెలుగులో “నేనే వస్తున్నా” పేరుతో భారీస్థాయిలో రిలీజ్ కానుంది.అగ్ర నిర్మాణ సంస్టగా పేరుగాంచిన గీత ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రం నుంచి ఇదివరకే రిలీజైన టీజర్, సాంగ్స్ అన్ని సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసాయి.“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

వి క్రియేషన్స్ బ్యానర్ పై “కలైపులి ఎస్ థాను” నిర్మించారు. తాజాగా తిరు సినిమాతో హిట్ అందుకున్న ధనుష్ తదుపరి చిత్రం “నేనే వస్తున్నా” ను తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం రేపు (సెప్టెంబర్ 29) న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.