Mahesh Babu Daughter: నాన్నమ్మ మృతిని తట్టుకోలేకపోయిన సితార.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..

నాన్నమ్మను కోల్పోయిన సితార వెక్కివెక్కి ఏడుస్తోంది. తాతయ్య కృష్ణ, తండ్రి మహేష్‌ ఎంత ఓదారుస్తున్నా కన్నీరు ఆగడం లేదు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు.

Mahesh Babu Daughter: నాన్నమ్మ మృతిని తట్టుకోలేకపోయిన సితార.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..
Mahesh Babu ,sitara
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 28, 2022 | 12:06 PM

నాన్నమ్మను కోల్పోయిన సితార వెక్కివెక్కి ఏడుస్తోంది. తాతయ్య కృష్ణ, తండ్రి మహేష్‌ ఎంత ఓదారుస్తున్నా కన్నీరు ఆగడం లేదు. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో ఇవాళ కన్నుమూశారు. ఈ శోకాన్ని దిగమింగడం సూపర్ స్టార్ కృష్ణకు, మహేష్‌కు ఎంత కష్టంగా ఉందో.. అంతకు మించిన బాధ సితారలో కనిపిస్తోంది. మహేష్‌ ఒడిలో కూర్చుని సితార ఏడుస్తూనే ఉంది. తల్లి నమ్రత ఓదారుస్తున్నా కూడా తేరుకోలేకపోయింది. బామ్మను కోల్పోయిన చిట్టితల్లి పడుతున్న ఆవేదన అందరి హృదయాల్నీ కలచివేస్తోంది. సితారకు తన నాన్నమ్మతో చాలా ఎమోషనల్ బాండింగ్‌ ఉంది. ఏ పండగొచ్చినా కచ్చితంగా నానమ్మ దగ్గరకు వెళ్తుంది. రోజంతా అక్కడ సంతోషంగా గడుపుతుంది. ఇది చూసిన ఇందిరాదేవి ఎంతగానో మురిసిపోయేవారు. నా కొడుక్కి పర్‌ఫెక్ట్‌ కూతురిని నువ్వు అంటూ.. సితారను ఎంతో మురిపెంగా చూసుకునేవారు. అలాగే మహేష్‌ తన కూతురికి సితార అని పేరు పెట్టినప్పుడు కూడా చాలా సంతోషంతో అందరికీ చాలా గొప్పగా చెప్పుకున్నారని సన్నిహితులు చెప్తారు.

— సితార రీసెంట్‌గా సర్కారు వారి పాట ప్రమోషన్‌లో కనిపించింది. మనవరాలు ఇలా కనిపించడం చూసి ఇందిర చాలా సంతోషపడ్డారు. సితార కూచిపూడి నేర్చుకుంది. అలాగే ఎప్పుడు నాన్నమ్మ ఇంటికి వెళ్లినా సంప్రదాయ బట్టల్లోనే వెళ్లేది. ఈ కూచిపూడి, సంప్రదాయ దుస్తులు అన్నీ కూడా నాన్నమ్మ మార్క్ అనే చెప్పాలి. అందుకే .. ఇద్దరి మధ్య అంతటి ఎమోషన్‌ బాండింగ్ ఉంది కాబట్టే సితార నాన్నమ్మను మర్చిపోలేకపోతోంది.

— నాన్నమ్మ దగ్గరకు వెళ్తే సితార తెలుగులోనే మాట్లాడుతుంది. ఇంట్లో మహేష్‌తోను, తల్లి నమ్రత, స్నేహితులతో ఇంగ్లీష్‌లో మాట్లాడే సితార.. నాన్నమ్మ దగ్గరకు వెళ్లేసరికి అచ్చతెలుగు ఆడపిల్ల అయిపోతుంది. మహేష్‌ కూడా వీలు కుదిరినప్పుడల్లా సితారను తీసుకుని తల్లి దగ్గరకు వెళ్లే వారు. అలా వెళ్లినప్పుడు ‘కాఫీ విత్ నాన్నమ్మ’ను సితార చాలా ఎంజాయ్ చేసేది. ఓ రకంగా చెప్పాలంటే ఇంత బిజీ లైఫ్‌లో, గ్లామర్‌ వాల్డ్‌లో రోజూ తిరుగుతున్నా నాన్నమ్మ ఇందిరాదేవి దగ్గరకు వెళ్లేసరికి సితార చిన్నపిల్ల అయిపోయేది. అక్కడ బామ్మతో చాలా క్వాలిటీ లైఫ్ గడిపేది. ఇవన్నీ మహేష్‌కు తెలుసు కాబట్టే కూతురిని ఓదార్చడానికి చాలా కష్టపడుతున్నారు. నాన్నమ్మను కోల్పోయిన బాధలో సితార కన్నీరు ఆపుకోలేకపోతున్నా దృశ్యాలు అందరి హృదయాల్నీ కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మత్తు కోసం తంటా.. కేక్‌ ఎసెన్స్‌ తాగి జైల్లో ముగ్గురు ఖైదీలు మృతి
మత్తు కోసం తంటా.. కేక్‌ ఎసెన్స్‌ తాగి జైల్లో ముగ్గురు ఖైదీలు మృతి
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
ఆస్ట్రేలియాలో ఫ్లాప్‌షో.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురు ఔట్?
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..