- Telugu News Entertainment Tollywood Deepika Padukone taken to hospital after actress complains of uneasiness
Deepika Padukone: ఆసుపత్రి పాలైన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే .. కారణం ఇదే
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్‌కు హాజరైంది దీపిక. ఆ సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు.
Updated on: Sep 28, 2022 | 1:02 PM

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర అసౌకర్యం కలగడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరింది.

ఆస్పత్రిలో చేరిన వెంటనే పలు రకాల పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కె షూటింగ్‌కు హాజరైంది దీపిక. ఆ సమయంలో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడంతో కామినేని ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు.

తీవ్ర పని ఒత్తిడితో దీపిక ఆరోగ్యం దెబ్బతింది. కాగా కొన్ని నెలల క్రితం దీపికకు కరోనా సోకింది. కరోనాను అధిగమించిన తర్వాత, ఆమె యూరోపియన్ పర్యటనకు వెళ్లింది.

యూరప్ నుంచి తిరిగొచ్చాక ప్రభాస్ తో షూటింగ్ స్టార్ట్ చేసింది. ఈ హెక్టిక్ వర్క్ షెడ్యూల్ తన రక్తపోటుపై ప్రభావం చూపిందని నిర్మాత అశ్వినీదత్ తెలియజేశారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ప్రాజెక్ట్- కేలో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు షారుక్ ఖాన్ హీరోగా నటిస్తోన్న పఠాన్‌లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది దీపిక.

మరోవైపు హృతిక్ రోషన్ సరసన ఫైటర్ చిత్రంలోనూ దీపికనే హీరోయిన్‌గా నటించనుంది.




