777 Charlie: మనసులను హత్తుకుంటున్న వీడియో.. 777 చార్లీ నుంచి డెలీటెడ్ సీన్.. మీరు చూశారా ?..
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి డెలిటెడ్ సీన్ విడుదల చేసింది చిత్రయూనిట్.
కన్నడ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) ప్రధాన పాత్రలో డైరెక్టర్ కె. కిరణ్ రాజ్ తెరకెక్కించిన 777 చార్లీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఒక వ్యక్తికి, చార్లి అనే కుక్కకు మధ్య ఉండే ప్రేమానుబంధాన్ని అందంగా చూపించారు డైరెక్టర్ కె.కిరణ్ రాజ్. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు భారీగా కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ సినిమా చూసి ప్రతి ప్రేక్షకుడు డైరెక్టర్ కె. కిరణ్ రాజ్ పై.. రక్షిత్ శెట్టి నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సైతం కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రక్షిత్ శెట్టి ప్రశంసలు కురిపించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ నుంచి డెలిటెడ్ సీన్ విడుదల చేసింది చిత్రయూనిట్.
లేటేస్ట్ గా రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది. అందులో అద్రిక అనే చిన్నారి బర్త్ డే సెలబ్రెషన్స్ జరుగుతుంటాయి. అక్కడకు ధర్మ తన కుక్క చార్లీతో కలిసి వస్తాడు. దీంతో వారిద్దరి అందరూ వింతగా చూస్తుంటారు. చార్లీ తన నోటితో ఓ వస్తువు పట్టుకుని వచ్చి అద్రికకు ఇస్తారు. ఇక ఆ తర్వాత అద్రిక కేక్ కట్ చేసి అందరికి ఇస్తుంది. చార్లీకి కూడా తినిపిస్తుంది. ఆ తర్వాత అద్రికతో కలిసి చార్లీ, ధర్మ సెల్ఫీ తీసుకుంటారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
A beautiful deleted scene from #777Charlie ❤️ pic.twitter.com/NDpNoebcHt
— LetsOTT Global (@LetsOTT) July 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.