Samantha: బాలీవుడ్‌లోనూ తగ్గేదే లే.. సమంత క్రేజ్‌కు బీటౌన్ ఫిదా.. ఆ యంగ్ హీరో సినిమాలో సామ్..
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం బీటౌన్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ అశ్వత్థామ.
విడాకుల ప్రకటన తర్వాత సామ్ జోరు పెంచింది (Samantha). వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. అటు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఆమె చేసే ప్రతి పోస్ట్ పట్ల నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాకుండా ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. టాలీవుడ్, కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హీరోయిన్ తాప్సీ నిర్మాణంలో సమంత ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల శభాష్ మిథు మూవీ ప్రమోషన్లలో తాప్సీ చెప్పుకొచ్చింది. తాజాగా సామ్ మరో ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం బీటౌన్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ది ఇమ్మోర్టల్స్ ఆఫ్ అశ్వత్థామ. ఈ సినిమాలో కథానాయికగా సమంత ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీకి సామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఇందులో ఆమె యాక్షన్ ప్రధానమైన పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. అలాగే కరణ్ జోహర్ దర్శకత్వంలోనూ సామ్ నటించనుందని టాక్. ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ తో సామ్ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఖుషి, యశోధ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి సరసన మరోసారి నటించనుందని టాక్.