Ram Pothineni: పూరి జగన్నాథ్ పై రామ్ ఆసక్తికర కామెంట్స్.. ఇస్మార్ట్ శంకర్ రోజులను గుర్తుచేసుకున్న ఎనర్జిటిక్ స్టార్..
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఆ యూనిఫామ్ లోనే ఒక పవర్ ఉంటుంది. గతంలో నాకు పోలీస్ నేపథ్యంలో ఉన్న చాలా కథలు వచ్చాయి.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం ది వారియర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమా పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్..డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
రామ్ మాట్లాడుతూ.. ” ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాను. ఆ యూనిఫామ్ లోనే ఒక పవర్ ఉంటుంది. గతంలో నాకు పోలీస్ నేపథ్యంలో ఉన్న చాలా కథలు వచ్చాయి. నాక్కూడా పోలీస్ పాత్ర చేయాలని ఉండేది. కానీ కొత్తగా అనిపించినప్పుడు చేయాలనుకున్నాను. అలాంటి ఒక పాయింట్ ఈ మూవీలో ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా నేను చేయడం నా అదృష్టం. పూరి కెరీర్ కి రామ్ బూస్ట్ ఇచ్చాడు అనడం ఆయన సంస్కారం. ఇస్మార్ట్ శంకర్ చేస్తున్న సమయంలో పూరి ప్రీవియస్ సినిమాల గురించి ఆలోచించలేదు. తెలుగులో ఉన్న గొప్ప దర్శకులలో పూరి ఒకు. ఆయన మాత్రమే ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమా తీయగలరు ” అంటూ చెప్పుకొచ్చారు.