Alia Bhatt: షూటింగ్లో బేబి బంప్‌తో అలియా కసరత్తులు.. నెట్టింట లీకైన ఫోటోస్..
వివాహం అనంతరం వెంటనే షూటింగ్ అంటూ ఈ జంట సెట్స్‌లో ప్రత్యేక్షమయ్యారు. ప్రస్తుతం అలియా హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ చేస్తుంది.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ ఏప్రిల్ 14న వివాహా బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఆరేళ్లు ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం వెంటనే షూటింగ్ అంటూ ఈ జంట సెట్స్‌లో ప్రత్యేక్షమయ్యారు. ప్రస్తుతం అలియా హాలీవుడ్ సినిమా హార్ట్ ఆఫ్ స్టోన్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ నోట్ షేర్ చేసింది అలియా. అందులో భాగంగా హార్ట్ ఆఫ్ స్టోన్ సెట్ నుంచి కొన్ని చిత్రాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆలియా పోస్ట్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అందులో అలియా బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్ సెట్ లో బేబీ బంప్ తోనే కష్టమైన కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల పోర్చ్ గల్ కు సంబంధంచిన షూటింగ్ ఫోటోలలోనూ అలియా బేబీ బంప్ ఫోటోస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎడారిలో జరిపినట్లు తెలుస్తోంది. కఠినమైన పరిస్థితులలో తన బేబీ బంప్ కవర్ అయ్యేలా అలియా బ్లాక్ జాకెట్ ధరించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆమె యోధురాలిగా కనిపించనుంది. అలియా ఎప్పుడూ తన సినిమాలు పాత్రలు, సినిమాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా ఉంటాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.