Rashmika Mandanna: బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా రష్మిక.. మరో క్రేజీ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి

తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ముందువరసలో ఉంటోంది రష్మిక మందన్న(Rashmika Mandanna). ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకుపరిచయం అయ్యింది ఈ కన్నడ సోయగం.

Rashmika Mandanna: బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా రష్మిక.. మరో క్రేజీ ఆఫర్ అందుకున్న శ్రీవల్లి
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 09, 2022 | 8:11 AM

తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ముందువరసలో ఉంటోంది రష్మిక మందన్న(Rashmika Mandanna). ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకుపరిచయం అయ్యింది ఈ కన్నడ సోయగం. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో తోలి తెలుగు హిట్ అనుకుంది రష్మిక. ఇక పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీతగోవిందం సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో ఈ అమ్మడికి పాన్ ఇండియా మూవీ పుష్పలో ఛాన్స్ వచ్చింది. తెలుగు కన్నడ తోపాటు తమిళ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రష్మిక. ఆ మధ్య కార్తీ సరసన సుల్తాన్ అనే సినిమాలో మెరిసింది. వీటితో పాటే బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది ఈ శ్రీవల్లి.

ఇప్పటికే హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసింది రష్మిక. . సిద్ధార్ధ్ మల్హొత్రా  హీరోగా నటిస్తోన్న మిస్టర్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది రష్మిక. ఈ సినిమా పాకిస్థాన్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న `గుడ్ బై`మూవీలో ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటీ. ఇదే క్రమంలో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న యానిమల్ మూవీలోనూ రష్మిక ఎంపిక అయ్యిందని టాక్. వీటితో పాటు ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను అందుకుందట ఈ క్యూట్ బ్యూటీ. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో రష్మిక ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించనున్నారు మేకర్స్. ఇలా బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటూ ఆశ్చర్య పరుస్తుంది రష్మిక. జోరు పెంచిన ఈ అమ్మడు తెలుగు,తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో  సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే