అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో సుమంత్ (Sumanth Akkineni) ఒకరు. ప్రేమకథ సినిమాతో హీరోగా తెలుగు చిత్రపరిశ్రమలోకి అరంగేట్రం చేసిన సుమంత్.. యువకుడు, గౌరి, సత్యం సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే యూత్‌లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన సుమంత్ క్యారెక్టర్ ప్రాధాన్యతను బట్టి సెకండ్ హీరోగానూ నటించి మెప్పించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అక్కినేని హీరో.. మళ్లీ రావా సినిమాతో రీఎంట్రీతో హిట్ అందుకున్నాడు. ఇటీవల మళ్లీ మొదలైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్.. ప్రస్తుతం మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సీతారామం మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో సుమంత్.. బ్రిగేడియర్ విష్ణు శర్మగా కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన సుమంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళ భాషలలో ఆగస్ట్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ థాకుర్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రష్మిక మందన్న కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ పై హను రాఘవపూడి నిర్మిస్తున్నారు.
Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam!
🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9
— Sumanth (@iSumanth) July 9, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.