- Telugu News Photo Gallery Cinema photos Taapsee Pannu In Avengers As An Indian Superhero Is Her Dream We Can’t Stop But Manifest This In The World
Taapsee Pannu: ‘ఆ పాత్ర చేయాలని ఎంతో ఆశగా ఉంది’.. మనుసులో మాట బయటపెట్టిన తాప్సీ పన్ను
కమర్షియల్ మూవీస్, గ్లామర్ రోల్స్, లేడీ ఓరియంటెడ్ ఫిలింస్, బయోపిక్స్.. ఇలా తాప్సీ కవర్ చేయని జానర్ అంటూ ఏది లేదు. కానీ ఇన్ని సినిమాలు చేసినా... తన డ్రీమ్ రోల్ మాత్రం అలాగే మిగిలిపోయిందట.
Updated on: Jul 09, 2022 | 1:41 PM

ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టన్ మిథాలీ రాజ్ కథతో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ శభాష్ మిథు. ప్రజెంట్ ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్న తాప్సీ... తన డ్రీమ్ రోల్‌ను రివీల్ చేశారు.

ఇప్పటికే యాక్షన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న తాప్సీకి అవెంజర్స్ తరహా సూపర్ హీరో క్యారెక్టర్‌లో నటించాలని ఉందట. అయితే ఈ విషయంలోనూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు ఈ నేషనల్ బ్యూటీ.

ఆల్రెడీ జనాలకు తెలిసిన హీరోయిక్ రోల్స్ కాకుండా... ఓ కొత్త సూపర్ పవర్‌గా తనని తాను తెర మీద చూసుకోవాలని ఉంది అంటున్నారు తాప్సీ. అది కూడా ఇండియన్ వర్షన్ సూపర్ హీరోగానే తెర మీద కనిపించాలన్నది తాప్సీ పెడుతున్న మరో కండిషన్.

ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద కూడా సూపర్ హీరో తరహా పాత్రలు బాగానే సందడి చేస్తున్నాయి.

మరి తాప్సీ చేసిన కామెంట్ తరువాత ఏ దర్శకుడైనా ఆ తరహా కథతో ఈ బ్యూటీని అప్రోచ్ అవుతారేమో చూడాలి.





























