Indian 2: కమల్ హాసన్ చిత్రంలో ఆ క్రికెటర్ తండ్రి.. ఇండియన్ 2లో పంజాబీ నటుడు..
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో కమల్ హసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటిస్తోంది.

పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఇండియన్ 2 చిత్రం తిరిగి పట్టాలెక్కనుంది. అనివార్య కారణాలతో ఈ సినిమా చిత్రీకరణ అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇందులో కమల్ హసన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో క్రికెటర్ ఫాదర్.. పంజాబీ సింగ్ యోగరాజ్ సింగ్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. నవంబర్ 1న చెన్నైలో ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమైంది. తన సన్నివేశం కోసం మేకప్ వేసుకుంటున్న యోగిరాజ్ సింగ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్ మ్యాన్ కు థాంక్స్. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది. అంటూ రాసుకొచ్చారు. ఈ సినిమాలో సిద్ధార్థ్, రుకల్, బాబీ సింహా కీలకపాత్రలలో నటిస్తున్నారు.




ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో కమల్ విభిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.