Faria Abdullah: జాతిరత్నాలు షూటింగ్ సమయంలో హీరోయిన్ను డైరెక్టర్ కొట్టారా ?.. క్లారిటీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా..
ఇటీవల బంగార్రాజు చిత్రంతో వెండితెరపై అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది.
డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఫరియా అబ్దుల్లా. ఈ మూవీతో తనదైన కామెడీ టైమింగ్తోనే కాకుండా హైట్ పరంగానూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల బంగార్రాజు చిత్రంతో వెండితెరపై అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇటీవల అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఫరియా.. తన కెరీర్, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
ఈ షోలో అలీ అడిగిన ప్రశ్నలక సరదాగా ఆన్సర్ ఇచ్చింది ఫరియా. ఈ క్రమంలోనే జాతిరత్నాలు షూటింగ్ సమయంలో నిన్ను డైరెక్టర్ అనుదీప్ కొట్టారట కదా అని అడగ్గా.. ఫరియా క్లారిటీ ఇచ్చేసింది. ” అది సరదాగా జరిగింది. ఆయన జోక్స్ వేసినప్పుడు నవ్వుతూ పక్కనున్న వాళ్లని కొడతారు. అది ఆయనకు అలవాటు. అలా ఒకసారి నన్ను చేత్తో అలా అన్నారు. అంతే ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తనకు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులోని మాటలను బయటపెట్టింది.
హైదరాబాద్లో పుట్టి పెరిగినా.. ఫరియా కుటుంబం ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు ఓటీటీలోనూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయట. ప్రస్తుతం ఫరియా నటిస్తోన్న లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ కథానాయికుడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ గాంధీ మేర్లపాక తెరకెక్కించారు.