Kurup : వివాదంలో చిక్కుకున్న దుల్కర్‌ సల్మాన్ సినిమా.. “కురుప్” పై కోర్టుకెక్కిన వ్యక్తి..

మళయాల స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..ఆయాన నటించిన ఓకే బంగారం సినిమా తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది.

Kurup : వివాదంలో చిక్కుకున్న దుల్కర్‌ సల్మాన్ సినిమా.. కురుప్ పై కోర్టుకెక్కిన వ్యక్తి..
Kurup
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Nov 13, 2021 | 6:46 AM

Kurup : మళయాల స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే..ఆయాన నటించిన ఓకే బంగారం సినిమా తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వత దుల్కర్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోకి డబ్‌ అయ్యాయి. ఇక నాగ్‌ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో దుల్కర్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. జెమిని గణేష్‌ పాత్రలో దుల్కర్‌ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే దుల్కర్‌ నటించిన తాజా చిత్రం కురుప్. ఈ సినిమా త్వరలోనే ప్రక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఓ పేరు మోసిన క్రిమినల్‌ జీవిత కథాంశంతో కురుప్‌ సినిమా తెరకెక్కింది. అయితే తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ‘కురుప్’ మూవీపై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సుకుమార కురుప్ అనే నేరస్థుడి గోప్యతను వెల్లడించేలా ఈ మూవీని తెరకెక్కించాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై కోర్టులో పిటీషన్‌ కూడా దాఖలు చేశాడు. అయితే కేరళ హైకోర్టు ‘కురుప్’ మూవీపై స్టే విధించడానికి మాత్రం నిరాకరించింది. అయితే ఈ మూవీ నిర్మాతలకు మాత్రం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కురుప్ సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి రోజే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్  దర్శకత్వం వహించారు. జితిన్ కె జోస్ కథను అందించగా.. డేనియల్ సయూజ్ నాయర్.. కెఎస్ అరవింద్ స్క్రీన్ ప్లే అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి.

NTR’s EMK Contestant: సామాన్యుడిని కోటీశ్వరుడు చేసిన తారక్ షో.. తన తెలివితేటలతో దుమ్ము రేపిన పోలీసు…

Manchu Vishnu: కోల్పోయిన దానిని మళ్లీ సాధిస్తానంటోన్న ప్రెసిడెంట్‌ విష్ణు.. ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌..

Nooran Sisters: విచిత్ర గానంతో.. మీమ్స్‌తో పాపులర్ అయిన ఈ సిస్టర్స్.. రెహ్మాన్ మెచ్చిన గాయనీమణులు అని తెలుసా..