Jani Master: బెంగళూరు రేవ్ పార్టీలో జానీ మాస్టర్.. వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చిన స్టార్ కొరియోగ్రాఫర్
లీవుడ్ నటుడు శ్రీకాంత్, హేమ సైతం ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో వారు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. లైవ్ వీడియోలు రిలీజ్ చేసి ఈ పార్టీతో తమకెలాంటి సంబంధంలేదని ఖండించారు. కాగా ఇదే రేవ్ పార్టీలో ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. జానీ మాస్టర్ ఈ పార్టీకి హాజరైనట్టు కొందరు నెట్టింట పోస్టులు షేర్ చేయగా..

బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్, హేమ సైతం ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ ప్రచారం జరిగింది. దీంతో వారు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. లైవ్ వీడియోలు రిలీజ్ చేసి ఈ పార్టీతో తమకెలాంటి సంబంధంలేదని ఖండించారు. కాగా ఇదే రేవ్ పార్టీలో ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. జానీ మాస్టర్ ఈ పార్టీకి హాజరైనట్టు కొందరు నెట్టింట పోస్టులు షేర్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. వీటిపై స్పందించిన జానీ మాస్టర్ సంబంధిత స్క్రీన్‌షాట్లను షేర్ చేస్తూ తనకు అలాంటి అలవాట్లు లేవని క్లారిటీ ఇచ్చారు. ‘నా గురించి తెలిసిన వాళ్లందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మానసిక స్థితి చూస్తుంటే జాలేస్తుంది’ అని జానీ మాస్టర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
అదే సమయంలో తాను హైదరాబాద్ లో తన వాళ్ల మధ్య తీరికలేకుండా గడుపుతున్నానంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు జానీ మాస్టర్. ‘హైదారాబాద్ లో నా వాళ్ల మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు. ఆదివారం డైరెక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఇప్పటివరకు మా అసోసియేషన్ లో ఉన్న నేను ఎలా అక్కడ ప్రత్యక్షమయ్యానో ఈ వార్త చేసిన, చేయించిన మతిలేని మహారథులకే తెలియాలి. చేతకానోడు చెడగొట్టడానికే చూస్తాడు. ఈ వివరణ కూడా వాళ్ల కోసం కాదు నన్ను వాళ్ల కుటుంబంలో ఒకరిలా అనుకునే వాళ్లకోసం’ అంటూ తనను టార్గెట్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు జానీ మాస్టర్.
జానీ మాస్టర్ షేర్ చేసిన వీడియో..
హైదారాబాద్ లో నా వాళ్ళ మధ్య తీరిక లేకుండా మా పనుల్లో నిమగ్నమై ఉన్న నేను ఎక్కడో, ఎవరితోనో, ఏదో చేస్తూ కనిపించానని చెబుతూ పుకార్లు లేపారు. మా సేనని, జనసేనానిని ఉద్దేశిస్తూ నోటికొచ్చింది రాస్తున్నారు.
నిన్న డైరక్టర్స్ డే సందర్భంగా జరిగిన ఈవెంట్ కి, నేడు నా చిరకాల స్నేహితుడిని… pic.twitter.com/iCTccquFkN
— Jani Master (@AlwaysJani) May 20, 2024
మాపై బురద చల్లొద్దు..
నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని.
అనవసరంగా నాపై, మా జనసేనాని పై బురద జల్లే ప్రయత్నం ఇది, ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం.
ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న,… pic.twitter.com/VgMgq2zIU8
— Jani Master (@AlwaysJani) May 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




