AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!

శీతాకాలంలో బయట లభించే వేయించిన, కారంగా ఉండే జంక్ ఫుడ్స్ తినకుండా ఉండాలని డాక్టర్ అమిత్ కుమార్ చెబుతున్నారు. ఎందుకంటే ఇవి బరువు పెరగడానికి, అలసటకు దారితీస్తాయి. సోయా ఆధారిత ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్ల..

చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
Thyroid Diet In Winter
Srilakshmi C
|

Updated on: Jan 13, 2026 | 8:33 AM

Share

శీతాకాలంలో థైరాయిడ్ రోగుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చలి పెరిగేకొద్దీ శరీరంలో నీరసం, అలసట, బరువు పెరగడం వంటి వివిధ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ ఉన్నప్పుడు మందులతో పాటు సరైన ఆహారం కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా వేయించిన, తీపి ఆహారాలు తినడం వల్ల థైరాయిడ్ రోగుల సమస్యలు పెరుగుతాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రకమైన సరికాని ఆహారం మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. అందువల్ల లక్షణాలను నియంత్రించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శీతాకాలంలో ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలి? ఏది తినకూడదు అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం. కాబట్టి శీతాకాలంలో థైరాయిడ్ రోగులు ఏ రకమైన ఆహారాలు తినాలో? ఏవి తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

శీతాకాలంలో థైరాయిడ్ రోగులు ఎలాంటి ఆహారాలు తినకూడదు?

శీతాకాలంలో బయట లభించే వేయించిన, కారంగా ఉండే జంక్ ఫుడ్స్ తినకుండా ఉండాలని డాక్టర్ అమిత్ కుమార్ చెబుతున్నారు. ఎందుకంటే ఇవి బరువు పెరగడానికి, అలసటకు దారితీస్తాయి. సోయా ఆధారిత ఉత్పత్తులను పెద్ద మొత్తంలో తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరగాయలను పచ్చిగా తినడం కూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ చక్కెర, శుద్ధి చేసిన పిండి, బేకరీ ఉత్పత్తులను తీసుకోవడం హానికరం. శీతాకాలంలో థైరాయిడ్ రోగులు టీ, కాఫీని అధికంగా తీసుకోవడం అంత మందిచికాదు. అందువల్ల ఈ ఆహారాలను పరిమితంగా తీసుకోవడం వల్ల లక్షణాలను నియంత్రించడం సులభం అవుతుంది.

థైరాయిడ్ రోగులు తినవలసిన ఆహారాలు

శీతాకాలంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు సమతుల్య, పోషకమైన ఆహారం తీసుకోవాలి. పరిమిత పరిమాణంలో వెచ్చని పాలు, పెరుగు, జున్ను తీసుకుంటే శరీరానికి శక్తిని అందిస్తాయి. ఆకుపచ్చ కూరగాయలు, కాలానుగుణ పండ్లు, ధాన్యాలు అవసరమైన పోషకాలను అందిస్తాయి. బాదం, వాల్‌నట్, అవిసె గింజలు వంటివి శరీరానికి శక్తిని అందిస్తాయి. జలుబు నుంచి రక్షిస్తాయి. తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అలసటను తగ్గిస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. ఈ ఆహారాలు థైరాయిడ్ రోగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

ఈ చిట్కాలను తప్పకుండా పాటించండి

  • ప్రతిరోజు మీ మందులను నిర్ణీత సమయంలో తీసుకోవాలి.
  • చల్లని వాతావరణంలో మీ శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవాలి.
  • ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయాలి.
  • తగినంత నిద్రపోవాలి.
  • ఒత్తిడిని తగ్గించుకోవాలి.
  • థైరాయిడ్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.