Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో లుక్.. ఆదిత్య కరికాలన్ గా చియాన్ విక్రమ్

సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు మణిరత్నం.. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆయన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతుంటాయి. తాజాగా మణిరత్నం చేస్తోన్న భారీ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్

Ponniyin Selvan: పొన్నియిన్ సెల్వన్ నుంచి మరో లుక్.. ఆదిత్య కరికాలన్ గా చియాన్ విక్రమ్
Ponniyin Selvan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2022 | 3:37 PM

సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా రాణిస్తున్నారు మణిరత్నం.. సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ ఆయన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోతుంటాయి. తాజాగా మణిరత్నం చేస్తోన్న భారీ బడ్జెట్ మూవీ పొన్నియన్ సెల్వన్(ponniyin selvan). విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వ‌ర్యా రాయ్‌, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ ఎపిక్ మూవీగా ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్‌ కానుంది. అయితే ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం అప్డేట్స్ కు చాలా టైం తీసుకుంటున్నారు.  ఇప్పటికే ఈ సినిమానుంచి కొంతమంది పోస్టర్లు రిలీజ్ చేశారు. పొన్నియిన్ సెల్వన్ నుంచి క్యారెక్టర్ లుక్స్ విడుదల చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి చియాన్ విక్రమ్ లుక్ ను రిలీజ్ చేశారు.

విక్రమ్ ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ అనే రాజుగా కనిపించనున్నారు. విజయ దరహాసం తో గుర్రం పై ఠీవీగా విక్రమ్ కూర్చున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ ప‌తాకాల‌పై మ‌ణిర‌త్నం, అల్లిరాజా సుభాస్క‌ర‌న్ నిర్మాత‌గాలుగా రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న‌ల్ ఎపిక్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’. భారీ నిర్మాణ విలుువలతో, హై టెక్నికల్ వేల్యూస్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతోంది. అందులో మొద‌టి భాగం ‘పొన్నియిన్ సెల్వ‌న్ 1’  ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.ఈ సినిమాలో  ఇప్పటివరకు విడుదల చేసిన ఒక్కో లుక్ ఒక్కో త‌ర‌హాలో డిఫ‌రెంట్‌గా ఆక‌ట్టుకుంటోంది. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే