RRR Movie: ఆర్ఆర్ఆర్ క్రేజ్ అంటే ఇదే.. హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ అక్కడ రికార్డ్..

మెగా పవర్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ క్రేజ్ అంటే ఇదే.. హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ అక్కడ రికార్డ్..
Rrr
Rajitha Chanti

|

Jul 04, 2022 | 11:56 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా పవర్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రూపొందించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. అంతేకాకుండా విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్ఆర్ఆర్ మరో సెన్సెషన్ రికార్డ్ సృష్టించింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మీడి సీజన్స్ అవార్డ్స్ 2022లో మొదటి భారతీయ చిత్రంగా నామినేట్ అయ్యింది.

ఈ అవార్డులలో హాలీవుడ్ చిత్రాలను వెనక్కు నెట్టి మరీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. పాన్ ఇండియన్ చలనచిత్రం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులలో ఉత్తమ చిత్రంగా రన్నరప్ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ నిలిచింది. శుక్రవారం హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డులను ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇందులో ఫేమస్ హాలీవుడ్ చిత్రాలైన టాప్ గన్: మావెరిక్, ది బాట్‌మాన్, ఎల్విస్స ది అన్ బేరబుల్ వెయిట్ ఆఫ్ మాసివ్ టాలెంట్ చిత్రాలను వెనక్కు నెట్టి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్ రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఇప్పటివరకు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో నామినేట్ చేయబడిన మొదటి భారతీయ చిత్రంగా కూడా రికార్డ్ సృష్టించింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. జూలై 2తో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై 100 రోజులు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్ఆర్ఆర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu