Bimbisara :’ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే’.. హై0ల్టేజ్ హిస్టారికల్ మూవీ బింబిసార ట్రైలర్ వచ్చేసింది..

నిన్నమొన్నటి వరకు లవ్ అండ్ హై ఎండ్ యాక్షన్ సినిమాలతో మనల్ని ఆకట్టుకున్న నందమూరి హీరో ఇప్పుడు ఫిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

Bimbisara :'ఇక్కడ రాక్షసుడైనా భగవంతుడైనా ఈ బింబిసారుడు ఒక్కడే'.. హై0ల్టేజ్ హిస్టారికల్ మూవీ బింబిసార ట్రైలర్ వచ్చేసింది..
Bimbisara
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2022 | 5:59 PM

నిన్నమొన్నటి వరకు లవ్ అండ్ హై ఎండ్ యాక్షన్ సినిమాలతో మనల్ని ఆకట్టుకున్న నందమూరి హీరో ఇప్పుడు ఫిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. కల్యాణ్ రామ్(Nandamuri Kalyanram) హీరోగా పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న సినిమా బింబిసార( Bimbisara).. ఈ సినిమాతో తనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు కళ్యాణ్ రామ్. అనుకోవడమే కాదా.. సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే అప్పట్లో అందర్నీ పాక్‌ చేశారు. ఆతర్వాత ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసిన యూట్యూబ్ ను షేక్ చేశారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం బింబిసారా. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వశిష్ట్‌ ఈ సినిమాను డైరెక్టర్‌ చేస్తున్నాడు.

ఇక ఈ మూవీ టీం రిలీజ్‌ చేసిన టీజర్ అందర్నీ ఆకట్టుకుంటూ.. సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఈ టీజర్‌లో కల్యాణ్ రామ్ లుక్‌… డైలాగులు.. బ్యాగ్రౌండ్‌ స్కోర్ అందర్నీ థ్రిల్ చేస్తున్నాయి. జెస్ట్ 1 మినెట్ టీజర్‌కే ఈ రెంజ్‌ రెస్పాన్స్‌ వస్తే.. ట్రైలర్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో అంటూ అప్పటి నుంచే నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది. ట్రైలర్ ఆద్యంతం ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఉంది. కళ్యాణ్ రామ్ మేకోవర్ , డైలాగ్ డెలివరీ, విజువల్స్, గ్రాఫిక్స్ సూపర్బ్ గా వర్కౌట్ అయినట్టు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. రంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కేథరిన్ .. సంయుక్త మీనన్ .. వార్నియా హుస్సేన్ అలరించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..