Sita Ramam: ‘ఇంతందం దారి మళ్లిందా’.. ‘సీతారామం’ నుంచి అందమైన మెలోడీ

దుల్కర్ సల్మాన్.. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ విబిబిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ..

Sita Ramam: 'ఇంతందం దారి మళ్లిందా'.. 'సీతారామం' నుంచి అందమైన మెలోడీ
Sita Ramam
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2022 | 5:08 PM

దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan).. మణిరత్నం దర్శకత్వం వహించిన ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముటి తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత దుల్కర్ నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతూ ఇక్కడి ప్రేక్షకుల ఆదరణ పొందాయి. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం సీతా రామం(Sita Ramam). డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతోందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. తాజాగా ఈ సినిమానుంచి మరో అందమైన మెలోడీని రిలీజ్ చేశారు. గతంలో ఫస్ట్ సింగిల్ గా ఓ సీత అనే పాటను రిలీజ్ చేశారు. తాజాగా ‘ఇంతందం దారి మళ్లిందా..’ అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ మెలోడీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా.. ఎస్. పి. బి చరణ్ ఆలపించారు.  ”సీతా రామం” తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతుంది. ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ అందమైన మెలోడీ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!