Karthikeya 2: అక్కినేని హీరో కోసం వెనక్కి తగ్గుతోన్న నిఖిల్‌..? కార్తికేయ2 విడుదల వాయిదా తప్పదా..

Karthikeya 2: నిఖిల్‌ (Nikhil) హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014లో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కించారు...

Karthikeya 2: అక్కినేని హీరో కోసం వెనక్కి తగ్గుతోన్న నిఖిల్‌..? కార్తికేయ2 విడుదల వాయిదా తప్పదా..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2022 | 4:23 PM

Karthikeya 2: నిఖిల్‌ (Nikhil) హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. 2014లో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను ద్వారకా నగరంపై జరిగే అన్వేషణ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమాను జూలై 22న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమోషన్స్‌ కూడా మొదలు పెట్టేశారు.

అయితే తాజాగా ఈ సినిమా వాయిదా పడనుందని తెలుస్తోంది. నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ‘థాంక్యూ’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కార్తికేయ 2 వాయిదా పడనుందని సమాచారం. థ్యాంక్యూ సినిమా ప్రొడ్యుసర్‌ దిల్‌ రాజు చిత్రాన్ని సోలోగో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే కార్తికేయ టీమ్‌తో సంప్రదింపులు కూడా జరిపారని సమాచారం.

ఒక వేళ ఈ ప్రపోజల్‌కు చిత్ర యూనిట్ ఒకే అంటే కార్తికేయ 2 ఆగస్టుకు వాయిదా పడనుందని తెలుస్తోంది. ఈ విషయమై చిత్ర యూనిట్‌ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి కార్తికేయ 2 వాయిదాపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి డాల్సిందే. ఇదిలా ఉంటే కార్తికేయ 2 చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ను ఈ సినిమాలో కీలక పోత్రలో తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే