Tarun Majumdar Dies: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సీనియర్ దర్శకులు తరుణ్ మజుందార్ కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ప్రకటన చేశారు. తరుణ్ మజుందార్ మృతికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
చిత్రపరిశ్రమలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులు తరుణ్ మజుందార్ (Tarun Majumdar Dies)జులై 4 సోమవారం మరణించారు. కలకత్తాలోని ఎస్ ఎస్ కె ఎం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న తరుణ్ మజుందార్ ని కొద్దిరోజుల క్రితమే ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మజుందార్ భార్య సంధ్యా రాయ్ పలు సినిమాల్లో నటిగా రాణించారు. 1960, 70,80 దశకాల్లో బెంగాలీ సినిమా ప్రతిష్టను ఆయన తన సినిమాలతో ఇనుమడింపచేశారు.92 ఏళ్ల తరుణ్ మృతిపై చిత్ర ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
తరుణ్ మజుందార్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన స్మృతి టుకు ధక్, శ్రీమాన్ పృధ్వీరాజ్, కుహెలి, బాలికా వధు, దాదర్ కీర్తి వంటి బెంగాలీ సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందాయి. 1990లో తరుణ్ మజుందార్‌కు పద్మశ్రీ అవార్డు లభించగా పలు జాతీయ అవార్డులు సహా ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి