AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral news: కుబేరుడిని మించిపోయిన ఆస్తి.. ఒక్కరోజు పాకెట్ మనీ రూ. 40 లక్షలు .. ఖర్చు చేయడమే ఆమె పని..

తల్లిదండ్రుల డబ్బు ఖర్చు చేయడమే తన ఫుల్‌టైమ్ జాబ్ అని చెప్పింది. ఆమె ఒక రోజులో తన కోసం రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. అలాంటి జీవితాన్ని

Viral news: కుబేరుడిని మించిపోయిన ఆస్తి.. ఒక్కరోజు పాకెట్ మనీ రూ. 40 లక్షలు .. ఖర్చు చేయడమే ఆమె పని..
Roma Abdesselam
Jyothi Gadda
|

Updated on: Jul 05, 2022 | 9:51 AM

Share

Roma Abdesselam: మీరు వర్క్ ఫర్ హోమ్ గురించి తప్పక విని ఉంటారు.. కానీ, ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రుల సంపాదించిన డబ్బు ఖర్చుపెట్టే ఉద్యోగం కూడా ఒకటి ఉంటుందని ఓ యువతి చెబుతోంది. తను అదే జాబ్‌ చేస్తున్నానని అంటోంది. తండ్రి డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడిపే “ఇంట్లో ఉండే కుమార్తెను నేను అని తనను తాను పిలుచుకుంటుంది. తల్లిదండ్రుల డబ్బు ఖర్చు చేయడమే తన ఫుల్‌టైమ్ జాబ్ అని చెప్పింది. ఆమె ఒక రోజులో తన కోసం రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. అలాంటి జీవితాన్ని గడపడం తనకు చాలా సరదా అని అంటోంది.. తిని, తాగి, సరదాగా గడపడమే తన పని అని చెబుతోంది. ఇంతకీ ఎవరా అదృష్టవంతురాలు.. ఏంట కథ ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూయార్క్‌కు చెందిన రోమా అబ్దెస్లామ్ తన విలాసవంతమైన జీవితాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. రోమా అబ్డెసిలమ్ న్యూయార్క్‌కు చెందిన టిక్‌టాక్ సెలబ్రిటీ. టిక్‌టాక్‌లో ఇప్పటివరకు దాదాపు 79,000 మంది తనను అనుసరిస్తున్నారు. ఆమె తనను తాను ‘ఇంట్లో ఉండు కూతురు’గా ప్రకటించుకుంది. ఆమె తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె రోజువారి పాకెట్ మనీ అమెరికా విలువలో 50 వేల డాలర్లు అంటే భారతీయ విలువలో దాదాపు 40 లక్షల రూపాయలు కావడం ఆశ్చర్యకరమైన వార్త. చదవడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! తన పోస్టుకు సంప్రదిస్తూ నెటిజన్లు తనను లిటిల్‌ప్రిన్స్‌తో పోలుస్తూ కామెంట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సమాచారాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన రోమో.. “నేను రోజూ ఉదయం నిద్రలేచి జిమ్‌కి వెళ్తాను. అప్పుడు నేను నా స్నేహితురాళ్లతో కలిసి షాపింగ్‌కి వెళ్తాను. ఇందుకోసం ప్రతిరోజు 50 వేల యూఎస్ డాలర్లు వెచ్చిస్తున్నాను అని తెలిపారు. ఆమె ఈ పోస్ట్ ఇతర చిన్న యువరాణులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, ఆమె తన కనుబొమ్మలను అందంగా మార్చడానికి ఖర్చు చేసిన మొత్తాన్ని పేర్కొంది. ఖర్చు చేసిన మొత్తం 600 డాలర్లు అని పేర్కొంది. అంటే భారత కరెన్సీలో 47,370 రూపాయలు.

ఇవి కూడా చదవండి

రోమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్య ఆధారిత స్వచ్ఛంద సంస్థలకు డబ్బును విరాళంగా అందిస్తుంది. రోమా మాట్లాడుతూ, “పాలస్తీనియన్,ఇజ్రాయెల్ పిల్లలకు అరబిక్, హీబ్రూ కలిపి బోధించే ఇజ్రాయెలీ పాఠశాల పట్ల నాకు చాలా మక్కువ. నేను జమైకాలోని ఒక పాఠశాలలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తాను.” అని చెప్పింది రోమా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి