Viral Video: ఫోటోస్ తీద్దామని వచ్చాడు.. రియల్ హీరో అయ్యాడు.. ప్రాణాలకు తెగించి పసివాళ్లను గట్టెక్కించాడు..

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వరదలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో తన ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను కాపాడాడు.

Viral Video: ఫోటోస్ తీద్దామని వచ్చాడు.. రియల్ హీరో అయ్యాడు.. ప్రాణాలకు తెగించి పసివాళ్లను గట్టెక్కించాడు..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2022 | 1:02 PM

వర్షకాలం ప్రారంభమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వరదలకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో తన ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను కాపాడాడు.

ఆ వీడియోలో ఇద్దరు పిల్లలు వరదల్లో చిక్కుకున్నారు. నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వారు నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. అదే సమయంలో అక్కడకు ఫోటోస్ తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆ చిన్నారులిద్దరిని గమనించాడు. అంతే తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా వరదల్లో చిక్కుకున్న పిల్లలిద్దరిని ఎంతో ధైర్యంతో ఒడ్డుకు తీసుకువచ్చాడు. అతను పిల్లలను ఒడ్డుకు చేర్చేందుకు ఎంతగా కష్టపడ్డాడో వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. అతని బ్యాలెన్స్ కాస్త తప్పినా పిల్లలతోపాటు అతను నీటి ప్రవాహం కొట్టుకుపోయేవాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ఘటన ఒమన్ లోని బహ్లా పట్టణంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ ఫోటో గ్రాఫర్ పేర అలి బిన్ నస్సెర్ అల్ వర్డీ అని తెలుస్తోంది. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.