Sini Shetty :ఈ మిస్ ఇండియా ముద్దుగుమ్మ గతంలో ఏ యాడ్‌లో కనిపించిందో తెలుసా..?
దేశంలో అందగత్తెలు వెనక్కి నెట్టి మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుంది అందాల ముద్దుగుమ్మ సినీ శెట్టి(Sini Shetty). 21 ఏళ్ల ఈ కన్నడ సోగాయం మిస్ ఇండియా 2022 విజేతగా నిలిచింది.
దేశంలో అందగత్తెలు వెనక్కి నెట్టి మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుంది అందాల ముద్దుగుమ్మ సినీ శెట్టి(Sini Shetty). 21 ఏళ్ల ఈ కన్నడ సోగాయం మిస్ ఇండియా 2022 విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన 58వ ఫెమినా అందాల పోటీలలో పలు రాష్ట్రాలకు చెందిన 31 మంది ఫైనలిస్టులు పోటీ పడ్డారు. ఇందులో కర్ణాటకకు చెందిన సినీ శెట్టి ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్ విజేతగా ప్రకటించారు. సినీశెట్టి కన్నడ మూలాలున్న ముంబై మోడల్. 2022 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఎందరో అందగత్తెలను తోసిరాజంటూ తనదైన రీతిలో కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ముంబైలో సెటిలైన కన్నడ కుటుంబంలో 2001లో సినీశెట్టి జన్మించారు. ఫ్యాషన్‌పై ఉన్న ఆసక్తి ఆమెను ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా నిలబెట్టింది. చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న ఇష్టం ఆమెను డాన్స్‌లో సైతం ఆరితేరేలా చేసింది. అమెకున్న ఈ అదనపు క్వాలిఫికేషన్స్ సైతం ముంబై వేదికపై తళుక్కున మెరిసి, జ్యూరీతో ఔరా అనిపించేలా చేశాయి. సోషల్ మీడియాలో సైతం పెద్దగా వినపడని, కనపడని ఈ అందగత్తె పేరుతో కేవలం ఇన్‌స్టాలో మాత్రమే ఎకౌంట్ ఉండడం విశేషం. ఫేస్‌బుక్ ఒక ఫ్యాషన్ గా తయారైన చోట, ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచ కలల సుందరికి ఫేస్‌బుక్ ఎకౌంట్ లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ట్విట్టర్‌లో కూడా ఈమె లేకపోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ అందాల సుందరి 2017లో తొలిసారి ఇన్‌స్టా ఫ్యామిలీలోకి అడుగుపెట్టారు. ప్రకృతి ప్రేమికురాలైన సినీ తొలి ఇన్‌స్టా ఫోటో కూడా ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అయితే పెద్దగా సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యమివ్వని సినీ శెట్టి ఒక్క మోడలింగ్ రంగంలోనే కాదు, చదువులోనే ఎంతో ముందుండడం విశేషం.
మిస్ ఫెమినా అకౌంటింగ్, ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సినీశెట్టి ప్రస్తుతం సీఎఫ్‌ఏ చేస్తున్నారు. అయితే ప్రముఖ నెట్‌వర్కింగ్ కంపెనీ ఎయిర్‌టెల్ కోసం గతంలో రూపొందించిన యాడ్ లో సినీ శెట్టి కెమెరా ముందుకు వచ్చారు. కెమెరా ముందు తన ప్రయాణం ఎంతో సరదాగా సాగిందని ఆమె తెలిపారు. అంతే కాదు ఈమె భరత నాట్యం డాన్సర్ కూడా కావడం విశేషం. నాలుగేళ్ళ వయస్సునుంచే నృత్యం నేర్చుకోవడం ఆరంభించిన సినీశెట్టి, స్టేజ్ పెర్‌ఫార్మెన్స్‌లు కూడా ఇచ్చారు. నాలుగేళ్ళకే నృత్యాభ్యాసాన్ని ప్రారంభించిన సినీ శెట్టి 14 ఏళ్ళ ప్రాయంలోనే ఆరంగేట్రమ్ చేశారు. ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ తో పనిచేస్తున్నప్పుడే జీవితంలో ఏదైనా కొత్తగా చేయాలన్న భావన మొదలైందని, అదే తనని మోడలింగ్ వైపు నడిపించిందనీ, ఈ రోజు ఈ స్థాయికి చేర్చిందనీ అంటారు సినీ శెట్టి. జీవితంలో ఏదీ సులభంగా రాదు. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలని మనసారా నమ్మే సినీ శెట్టి ఈ స్థాయికి చేరడానికి ఆమె స్వయం కృషే కారణం.