Rajamouli: తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మరోసారి స్పందించిన జక్కన్న.. మహాభారతాన్ని ఎప్పుడు మొదలు పెట్టనున్నారంటే..
Rajamouli: తెలుగు సినిమా స్థాయిని, ఆ మాటకొస్తే భారతీయ సినిమా స్థాయిని దర్శకుడు రాజమౌళి ఓ మెట్టు పైకెక్కిచ్చారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాహుబలి (Bahubali) అనే...
Rajamouli: తెలుగు సినిమా స్థాయిని, ఆ మాటకొస్తే భారతీయ సినిమా స్థాయిని దర్శకుడు రాజమౌళి ఓ మెట్టు పైకెక్కిచ్చారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాహుబలి (Bahubali) అనే ఒక్క సినిమాతో యావత్ దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విదేశాల్లోనూ విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక అనంతరం వచ్చిన ఆర్.ఆర్.ఆర్‌తో మరోసారి తన సత్తా చాటాడు రాజమౌళి. దేశ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది.
దీంతో రాజమౌళి దేశంలో ఎక్కడికి వెళ్లినా మీడియా ఆయన వెంట పడుతోంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై స్పందించాడు. మొదటి నుంచి మహా భారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పే రాజమౌళి, దృశ్యకావ్యాన్ని తెరకెక్కించే విషయమై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, పురాణ ఇతిహాసాలపై తనకు ఎనలేని గౌరవం ఉందని తెలిపిన జక్కన్న మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు.
అయితే మహా భారతం ఒక సముద్రం లాంటిదని, అందులోకి అగుడు పెట్టేందుకు చాలా సమయం పడుతుందన్నాడు. మరో మూడు నుంచి నాలుగు సినిమాలు తీసిన తర్వాతే మహా భారతం మొదలు పెడతానని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ లెక్కన్న జక్కన్న నుంచి మహా భారతంలో రావాలంటే కనీసం పదేళ్లయినా వేచి చూడాల్సిందే అన్నమాట.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..