Godfather: మెగాస్వాగ్.. ‘గాడ్ ఫాదర్’ లుక్ వచ్చేసింది.. అదరగొట్టిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(Godfather). మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

Godfather: మెగాస్వాగ్.. 'గాడ్ ఫాదర్' లుక్ వచ్చేసింది.. అదరగొట్టిన మెగాస్టార్
God Father
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2022 | 6:16 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(Godfather). మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. స‌ల్మాన్ ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌పై వచ్చే స‌న్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. తెలుగులో స‌ల్మాన్‌ఖాన్ న‌టించ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఇలా మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్‌లు ఇద్ద‌రూ ఒకేచోట కనిపించ‌డం అభిమానుల‌కు పండుగే.ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా నయన తార నటిస్తోన్నారు. తాజాగా ఈ సినిమానుంచి ,మెగాస్టార్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు గాడ్ ఫాదర్ నుంచి మెగాస్టార్ లుక్ తో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

నెరిసిన జుట్టుతో బ్లాక్ డ్రస్ లో అదరగొట్టారు మెగాస్టార్. తన స్వాగ్ తో మరోసారి అదరగొట్టారు చిరు. సునీల్ కారు డోర్ తీయగా మెగాస్టార్ కారు దిగి వస్తున్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో బ్యాగ్ గ్రౌండ్ మ్యుజిక్ అదిరిపోయింది. తమన్ మరోసారి తన మ్యూజిక్ తో అలరించనున్నారని అర్ధమవుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 11న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ తో మెగాస్టార్ ఫుల్ బిజీ కానున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ , బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరన్న సినిమాలు చేస్తున్నారు చిరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి