Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ చూసిన చిరంజీవి.. మూవీ యూనిట్‌ను ఇంటికి పిలుపించుకుని మరీ అభినందనలు.. వీడియో
సిద్దు తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక అనుపమ అంద చందాలు, ఆఖరిలో నేహా శెట్టి ఎంట్రీ టిల్లు సీక్వెల్ ను సక్సెస్ బాటలో నడిపించాయి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోపే రూ. 68 కోట్లకు పైగా వసూల్ చేసి 100 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'టిల్లు స్క్వేర్' సినిమాను చూశారు

టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ మొదటి సారి జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్’. సుమారు రెండేళ్ల క్రితం రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న టిల్లు స్క్వేర్ ఎట్టకేలకు మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎప్పటిలాగే సిద్దు తన యాక్టింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక అనుపమ అంద చందాలు, ఆఖరిలో నేహా శెట్టి ఎంట్రీ టిల్లు సీక్వెల్ ను సక్సెస్ బాటలో నడిపించాయి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మూడు రోజుల్లోపే రూ. 68 కోట్లకు పైగా వసూల్ చేసి 100 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘టిల్లు స్క్వేర్’ సినిమాను చూశారు. అనంతరం చిత్ర బృందాన్ని ఇంటికి పిలిపించుకుని మరీ అభినందనలు చెప్పారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. చిత్ర బృందాన్ని అభినందించాలని ఇంటికి పిలిచాను. సిద్ధు అంటే ఇంట్లో వాళ్లుందరికీ ఇష్టం’
‘డీజే టిల్లు’ వచ్చిన తర్వాత చాలా రోజులకు ‘టిల్లు స్క్వేర్’ విడుదల చేశారు. సినిమా చూస్తే వావ్ అనిపించింది. సినిమా అంతా చాలా సరదాగా, చాలా ఉత్కంఠగా, నవ్వులు పూయించింది. చిత్రబృందం సమష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఇక సిద్దు ఒక్కడై ఉండి ఈ సినిమాను నడిపించాడు. నటుడిగా, రైటర్ గా మంచి ప్రతిభ కనబర్చాడు. మనస్ఫూర్తిగా అతనిని అభినందిస్తున్నాను. చాలామంది ఇది అడల్ట్ కంటెంట్, యూత్ కు మాత్రమే అనుకుంటున్నారు. యూనివర్సల్ గా అందరికీ నచ్చే కంటెంట్ ఉన్న సినిమా టిల్లు స్క్వేర్ . నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
చిరంజీవి ఇంట్లో టిల్లు స్క్వేర్ చిత్ర బృందం.. వీడియో
A praise that can make your day is a validation that your film is a bonafide blockbuster.🤩 Megastar @KChiruTweets garu watched our #TilluSquare and appreciated it as a thorough entertainer. Thank you for your warm wishes, sir ❤️🤗#Siddu @anupamahere @vamsi84 pic.twitter.com/nHqo1MQtHZ
— Sithara Entertainments (@SitharaEnts) April 1, 2024
‘టిల్లు స్క్వేర్’ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ బాణీలు అందించారు.
చిరంజీవితో టిల్లు స్క్వేర్ యూనిట్ .. ఫొటోస్..
Megastar @KChiruTweets garu Congratulated the whole team of #TilluSquare on scoring the Double Blockbuster, Here are some candid moments from the meet! ❤️🔥#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo @kalyanshankar23 @NavinNooli @vamsi84 pic.twitter.com/7SB9cYKjKD
— Sithara Entertainments (@SitharaEnts) April 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.