Srivalli Song: ‘పుష్ప’ మేనియా.. తగ్గేదేలే అంటున్న బుడ్డోడు.. ‘శ్రీవల్లి’ పాటకు అదిరిపోయే స్టెప్పులు.!
'పుష్పా.. పుష్పరాజ్.. నీయవ్వా తగ్గేదే..లే'.. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...
‘పుష్పా.. పుష్పరాజ్.. నీయవ్వా తగ్గేదే..లే’.. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశమంతా ప్రస్తుతం పుష్ప మేనియా కొనసాగుతోంది. ఫ్యాన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీలు, క్రికెటర్ల వరకు అందరూ కూడా పుష్ప సినిమా డైలాగులు, పాటలకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. వీటితో సోషల్ మీడియా ఓ మోత మోగుతోంది. ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి సాంగ్ అన్ని భాషల్లో హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది.
నెట్టింట ఎక్కడ చూసినా బన్నీ సిగ్నేచర్ స్టెప్ వీడియోలే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పాట పెట్టుకుని స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా ఓ బుడ్డోడు అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేస్తూ ‘శ్రీవల్లి’ పాటకు స్టెప్పులు వేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. టీవీలో శ్రీవల్లి పాట ప్లే అవుతోంది. ఇక బన్నీ సిగ్నేచర్ స్టెప్ వేస్తుండగా.. బుడ్డోడు కూడా బన్నీతో పాటుగా భుజాన్ని పైకెత్తి చుట్టూ తిరుగుతూ స్టెప్పులు వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చి పడుతున్నాయి. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.
ఇవి చదవండి:
Viral Photo: తగ్గేదే..లే! మీరు ఈ ఫోటోలోని పామును కనిపెడితే గ్రేటే.. అంత ఈజీ కాదండోయ్!
Viral Photo: అందంలో అప్సరస.. కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టారా.?
భార్యతో కలిసి హోటల్‌కు వెళ్ళిన వ్యక్తి.. ఆరా తీయగా ఫ్యూజులౌట్.. శృంగార యాత్రల గుట్టురట్టు..
Viral Video: తొండంతో పెయింటింగ్ వేస్తోన్న ఏనుగు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!