AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: భార్యతో కలిసి హోటల్‌కు వెళ్ళిన వ్యక్తి.. ఆరా తీయగా ఫ్యూజులౌట్.. శృంగార యాత్రల గుట్టురట్టు..

ఓ ప్రబుద్దుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. కట్టుకున్న భార్యకు బిజినెస్ ట్రిప్పులని చెబుతూ..

Viral: భార్యతో కలిసి హోటల్‌కు వెళ్ళిన వ్యక్తి.. ఆరా తీయగా ఫ్యూజులౌట్.. శృంగార యాత్రల గుట్టురట్టు..
Extra Marital Affair
Ravi Kiran
|

Updated on: Feb 06, 2022 | 8:06 AM

Share

ఓ ప్రబుద్దుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసేందుకు పెద్ద స్కెచ్ వేశాడు. కట్టుకున్న భార్యకు బిజినెస్ ట్రిప్పులని చెబుతూ.. గర్ల్‌ఫ్రెండ్‌తో శృంగార యాత్రలు చేస్తూ వచ్చాడు. అయితే భర్త ప్రవర్తనపై అనుమానపడ్డ భార్య.. అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ స్టోరీ ఏంటి.? ఆమె ఎలా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందో తెలుసుకుందాం.!

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌కు చెందిన 41 ఏళ్ల వ్యాపారవేత్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. తరచూ బిజినెస్ ట్రిప్పులంటూ వేరే ఊర్లకు వెళ్లాలని భార్యతో చెప్పి గర్ల్‌ఫ్రెండ్‌తో చెక్కేసేవాడు. ఇక భర్త ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. బిజినెస్ ట్రిప్పులను బయటికి వెళ్తున్న భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు టెక్నాలజీని ఉపయోగించింది. సీక్రెట్‌గా భర్త వాహనానికి ఓ జీపీఎస్ ట్రాకర్‌ను ఫిక్స్ చేసింది. గతేడాది నవంబర్‌లో బిజినెస్ పనుల నిమిత్తం బెంగుళూరు వెళ్తున్నానంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. అయితే జీపీఎస్ లొకేషన్ ప్రకారం తన భర్త కారు పూణేలో ఉన్నట్లు గుర్తించింది సదరు మహిళ. దీనితో ఆమె అనుమానం మరింత బలపడింది.

వెంటనే భర్త బస చేసిన హోటల్‌కు వెళ్లింది. అక్కడున్న హోటల్ సిబ్బందిని ఎంక్వయిరీ చేసింది. ఆ వ్యాపారవేత్త తన భార్యతో కలిసి చెకిన్ అయ్యాడని వారు చెప్పారు. ఇది అస్సలు సాధ్యం కాదే అనుకుంటూ ఆమె హోటల్ సిబ్బందిని విజ్ఞప్తి చేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసింది. తన భర్త వేరే మహిళతో చెకిన్ అవుతున్నట్లు కనిపించింది. అంతేకాదు అతడి గర్ల్‌ఫ్రెండ్‌ను భార్యగా చిత్రీకరించేందుకు.. తన ఆధార్ కార్డును ఉపయోగించినట్లు ఆమె గుర్తించింది. దీనితో సదరు మహిళ తన భర్త వివాహేతర సంబంధంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 419 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవి చదవండి:

Follow Us
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..