Viral Photo: అందంలో అప్సరస.. కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టారా.?

ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అందంలో అప్సరస.. కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ. ఈ అందాల భామ...

Viral Photo: అందంలో అప్సరస.. కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood Heroine
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 06, 2022 | 8:02 AM

ఈ ఫోటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? అందంలో అప్సరస.. కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ. ఈ అందాల భామ చేసింది తక్కువే సినిమాలు అయినప్పటికీ తెలుగు(Tollywood)లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఎవరో కనిపెట్టారా.? ఇంకా గుర్తుపట్టలేకపోయారా.! అయితే ఓ చిన్న క్లూ ఇస్తాం.. ఈమె అక్కినేని వారబ్బాయి సరసన తన తొలి చిత్రంలో నటించింది. ఇప్పటికీ ఆ హీరోయిన్ ఎవరన్నది మీకు ఇంకా అర్ధం కాలేదా.! ఆమెవరో కాదండీ.. ‘చి..ల..సౌ’(Chi.. La.. Sow) సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ(Ruhani Sharma).

సాధారణంగా ఇటీవల సోషల్ మీడియా వినియోగం ఎక్కువైపోవడంతో హీరోహీరోయిన్లకు, ఫ్యాన్స్‌కు మధ్య ఉన్న దూరం తగ్గిపోయింది. సెలబ్రిటీలు వీలు కుదిరినప్పుడల్లా ఇన్‌స్టా లైవ్‌లలోకి వస్తూ.. తమ లేటెస్ట్ ఫోటోలను, సినిమా అప్‌డేట్స్‌ను షేర్ చేస్తున్నారు. ఇక నెట్టింట ‘త్రోబ్యాక్’ ఫోటోల ట్రెండ్ కొనసాగుతుండటంతో యంగ్ హీరోయిన్ల దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ప్రతీ ఒక్కరి చైల్డ్ హుడ్ పిక్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ కోవలోనే తాజాగా రుహాని శర్మ చిన్ననాటి ఫోటోస్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.

‘చి..ల..సౌ’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ. తొలి చిత్రంతోనే అటు అందం.. ఇటు అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్’గా సైమా అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ‘హిట్.. ది ఫస్ట్ కేస్’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాల చేసిన రుహనీ.. త్వరలోనే ‘మీట్ క్యూట్’, ‘ఆగ్రా’ అనే చిత్రాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇది చదవండి: Viral Photo: తగ్గేదే..లే! మీరు ఈ ఫోటోలోని పామును కనిపెడితే గ్రేటే.. అంత ఈజీ కాదండోయ్!