Viral Photo: తగ్గేదే..లే! మీరు ఈ ఫోటోలోని పామును కనిపెడితే గ్రేటే.. అంత ఈజీ కాదండోయ్!

కొన్నిసార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో పలు ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో ఉన్నది..

Viral Photo: తగ్గేదే..లే! మీరు ఈ ఫోటోలోని పామును కనిపెడితే గ్రేటే.. అంత ఈజీ కాదండోయ్!
Find The Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 05, 2022 | 8:22 PM

కొన్నిసార్లు మన కళ్లు మనల్నే మోసం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో పలు ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో ఉన్నది ఒకటయితే.. బయటకి మరొకటి కనిపిస్తుంది. వాటినే ఆప్టికల్ ఇలుష్యన్స్ లేదా ఫోటో పజిల్స్ అని అంటుంటారు. సాధారణంగా మనందరం పజిల్స్‌ను ఓ పట్టు పడుతుంటాం. మెదడుకు మేత వేసేందుకు వీకెండ్‌ బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే సుడోకోలు, పద సంపత్తి లాంటి పజిల్స్ చేధిస్తుంటాం. ఇవి మనకు బోర్ కొట్టకుండా చేస్తాయి.

అయితే ఫోటో పజిల్స్ మరో ఎత్తు.. వీటిని సాల్వ్ చేయాలంటే మన కళ్లకు పదునుండాలి. కళ్లకు పదునుంటే ఫోటో పజిల్స్‌ను ఒక్క అటెంప్ట్‌లో సాల్వ్ చేసేయగలం. ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్‌పై నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. తమ బుర్రకు పదును పెట్టి ఎంత కష్టమైన పజిల్ అయినా కూడా సాల్వ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కొన్నిసార్లు పాత ఫోటో పజిల్స్ సైతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కోవలో తాజాగా ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఫోటో పజిల్ గురించి మాట్లాడుకుందాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. ఎండిన ఆకులు, గడ్డి, పిచ్చి మొక్కలతో నిండిన ఆ ప్రాంతంలో విషపూరితమైన పాము నక్కి ఉంది. ఎరను చాకచక్యంగా పట్టుకునేందుకు దాక్కుని ఉంది. మరి అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. ఆ పాము చర్మం రంగు మొక్కలలో ఇమిడిపోవడంతో చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. మరి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. మీ కళ్ళు డేగ కళ్లయితే.. చిటికెలో కనిపెట్టేస్తారు. లేట్ ఎందుకు లెట్స్ డూ ఇట్.. మీరూ మిస్ అయితే.. సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి..