Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar: ఆ మధుర గానం మూగబోయింది.. భారత కోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరు..

Lata Mangeshkar: భారత కోకిలగా యావత్‌ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాసవిడిచారు. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న...

Lata Mangeshkar: ఆ మధుర గానం మూగబోయింది.. భారత కోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరు..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 06, 2022 | 10:13 AM

Lata Mangeshkar: భారత కోకిలగా యావత్‌ భారతదేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ (Lata Mangeshkar) ఇకలేరు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.  ఇటీవల కరోనా (Corona) నుంచి కోలుకున్న లతా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

కోవిడ్‌ కారణంగా జనవరి 11న ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే జనవరి నెలఖారున కరోనా నుంచి కోలుకున్న లతా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆమెకు వైద్యులు చికిత్సనందించినా ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. తన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా మంగేష్కర్‌ లేరన్న విషయాన్ని ఆమె అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు.

Also Read: Justin Prabhakaran: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న రాధేశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్.. భామా కలాపం కోసం జస్టిన్ ప్రభాకరన్..

FYI: భారతదేశంలో ఎంత మంది ఖైదీలు జైల్లో ఉన్నారో తెలుసా..? ఇంకా నేరం రుజువు కాని వారు ఎంత మంది?

Pushpa: రోజురోజుకూ పెరుగుతోన్న పుష్ప క్రేజ్‌.. రైల్వే శాఖ కూడా బన్నీ సినిమాను వాడేసిందిగా..