AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lata Mangeshkar: సినీ వినిలాకాశంలో గాన కోకిల.. పాటల తోటలో చెరగని సంతకం లతా సొంతం.

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌.. ఇండియన్‌ సినిమా ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నోటి నుంచి జాలు వారిన ప్రతీ పాట ఒక అద్భుతం. ఆమె పాట పాడితే చాలు అదొక అద్భుతం...

Lata Mangeshkar: సినీ వినిలాకాశంలో గాన కోకిల.. పాటల తోటలో చెరగని సంతకం లతా సొంతం.
Narender Vaitla
|

Updated on: Feb 06, 2022 | 10:14 AM

Share

Lata Mangeshkar: లతా మంగేష్కర్‌.. ఇండియన్‌ సినిమా ప్రేక్షకులకు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నోటి నుంచి జాలు వారిన ప్రతీ పాట ఒక అద్భుతం. ఆమె పాట పాడితే చాలు అదొక అద్భుతం. భారత కోకిలగా దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు లతా. ఎన్నో ఏళ్ల పాటు తన గానామృతంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన లతా మంగేష్కర్‌ అశేష అభిమానులను వదిలి వెళ్లిపోయారు. కోవిడ్‌ కారణంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న లతా.. ముంయిలోని బ్రీచ్‌ క్యాడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. భారతీయ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసిన లతా మంగేష్కర్‌ జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

లతా మంగేష్కర్‌ 1929, సెప్టెంబర్‌ 28న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు మొదటి సంతానం ఆమె. పువ్వు పుట్టగానే మరిమలించినట్లు లతా మంగేష్కర్‌ చిన్నతనంలోనే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసులు అమన్ అలీ ఖాన్, అమానత్ అలీ ఖాన్‌ల వద్ద శిష్యరికం తీసుకున్నారు లతా. 13 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ పోషణ భారమంతా లతాపై పడింది. లతా తొలిసారి 1942లో పహ్లా మంగళ్ గౌర్ అనే చిత్రంలో నటించి, పాటలు కూడా పాడారు.

గాయనిగా దేశం గుర్తించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్‌ కెరీర్‌ తొలినాళ్లలో మాత్రం పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే తనపై వచ్చిన విమర్శలనే మెట్లగా మార్చుకున్న లతా.. గాయనిగా ఉన్నత స్థానానికి ఎదిగారు. ‘మహాల్‌’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇందులో ఆయేగా ఆయేగా పాటతో ఒక్కసారిగా సినీ అభిమానుల తన దృష్టిని తనవైపు తిప్పుకున్న లతా.. అక్కడి నుంచి వెనక్కి తిరిగి తీసుకునే అవసరం రాలేదు. అనంతరం లతా మంగేష్కర్‌ అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, దులారీ చిత్రాలతో స్టార్‌ సింగర్‌గా ఎదిగారు. ఓవైపు సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు సంగీత కచేరీలు కూడా నిర్వహించారు లతా. విదేశాల్లోనూ కచేరీలు చేశారు. 1974లో లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో మొదటి విదేశీ కచేరీ చేశారామె.

తన అద్భుత గాత్రంతో ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న లతాకు రివార్డులతో పాటు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినీ రంగంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్న లతాకు భారత సర్కారు కూడా అత్యుత్తమ పురస్కారలతో సత్కరించింది.

సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత రత్న, పద్మ విభూషన్‌, పద్మభూషన్‌ వంటి అవార్డులు దక్కాయి. గత కొంత కాలంలో అనారోగ్యం కారణంగా లతా పాటలు పాడని లలిత, పలు టీవీ షోలలో పాల్గొని ఔత్సాహిక గాయనీ, గాయకులకు దిశా నిర్ధేశం చేస్తూ వచ్చారు. కొన్ని వేల పాటలతో దేశ వ్యాప్తంగా అభిమానులను అలరించిన లతా లోకాన్ని వదిలి వెళ్లడం సినీ లోకానికి తీరని లోటు అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

Also Read: Lata Mangeshkar: మళ్లీ క్షీణించిన లతా మంగేష్కర్‌ ఆరోగ్యం.. వెంటిలేటర్‌ పై చికిత్స అందిస్తోన్న వైద్యులు..

IND vs WI: కోహ్లీ, రోహిత్ జోడీ ఖజానాలో మరో స్పెషల్ రికార్డు.. అదేంటంటే?

US Police: కోడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!