IND vs WI: కోహ్లీ, రోహిత్ జోడీ ఖజానాలో మరో స్పెషల్ రికార్డు.. అదేంటంటే?
ఫిబ్రవరి 6 ఆదివారం నుంచి అహ్మదాబాద్‌లో టీమిండియా 1000 వన్డే మ్యాచ్ ఆడనుంది.
తొలి వన్డేలో కోహ్లి 6 పరుగులు చేస్తే భారత గడ్డపై అత్యంత వేగంగా 5000 వన్డే పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కనున్నాడు.
కోహ్లి ఇప్పటి వరకు 95 ఇన్నింగ్స్‌ల్లో 4994 పరుగులు చేశాడు.
సచిన్ 121 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును నెలకొల్పాడు. సచిన్ అత్యధికంగా 6976 పరుగులు (160 ఇన్నింగ్స్) చేసి తొలిస్థానంలో నిలిచాడు.
కోహ్లి, రోహిత్ జోడీ ఈ సిరీస్‌లో 94 పరుగుల భాగస్వామ్యాన్ని సాధిస్తే, 5000 పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యాన్ని పంచుకున్న భారత్‌లో మూడో జోడీగా అవతరిస్తారు.
ప్రస్తుతం వీరిద్దరూ 81 ఇన్నింగ్స్‌ల్లో 18 సెంచరీలు, 15 అర్ధ సెంచరీల భాగస్వామ్యాలతో 4906 పరుగులు చేశారు. 64.55 సగటు పరుగులు సాధించారు.
ఈ జాబితాలో సచిన్, గంగూలీ జోడీ 176 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు, 29 అర్ధ సెంచరీల భాగస్వామ్యాలతో రికార్డు స్థాయిలో 8227 పరుగులు జోడించారు.
112 ఇన్నింగ్స్‌ల్లో 5023 పరుగులు (17 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు) జోడించిన రోహిత్, శిఖర్ ధావన్‌ల జోడీ రెండో స్థానంలో ఉంది.