Megastar Chiranjeevi: కరోనా నుంచి కోలుకున్న చిరంజీవి.. బ్యాక్ టూ వర్క్ అంటూ మెగాస్టార్ ట్వీట్..
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త చెప్పారు. కరోనా నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‌లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు శుభవార్త చెప్పారు. కరోనా నుంచి కోలుకుని తిరిగి షూటింగ్‌లోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు మెగాస్టార్. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించినవారందరికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. గత కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని. స్వల్పంగా లక్షణాలున్నాయని.. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నట్లు ట్వీట్ చేశారు చిరు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కోవిడ్ నుంచి కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ సెట్లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరు. ప్రస్తుతం మెగాస్టార్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు చిరంజీవి. అలాగే సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు.
Tested Negative. Back to work & Back in Action with full steam 🙂 Heartfelt thanks for all your love and wishes for my recovery. Humbled & Energised! pic.twitter.com/zFqzrOxBCv
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 6, 2022
Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..
Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్ హీరోయిన్ నాటీ కామెంట్..