Ashu Reddy: నెట్టింట్లో అషు రెడ్డి రచ్చ.. ఏకంగా ఫోన్ నంబర్ షేర్ చేసి జలక్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. దండం పెట్టిన నెటిజన్..
అషూ రెడ్డి (Ashu Reddy).. సోషల్ మీడియాలో తెలియని వారుండరు. బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 3 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు
అషూ రెడ్డి (Ashu Reddy).. సోషల్ మీడియాలో తెలియని వారుండరు. బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ 3 ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక నెట్టింట్లో ఈమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్, ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తుంటూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో అషూ రెడ్డి చేసే వింత ఫోటో షూట్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఆమె పెట్టే ఫోజులు నవ్వులు పూయిస్తుంటారు. అలాగే అషూ రెడ్డి ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.. ఎన్నో సార్లు ఆమెను ఇష్టానుసారంగా ట్రోల్ చేసేవారు నెటిజన్స్. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూపోతుంది అషూ రెడ్డి.
ఇటీవల అరియానా నడుముపై ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసి షాకిచ్చింది అషూ. దీంతో ఆ ఫోటోపై.. అషూ రెడ్డి తీరుపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇందుకు అషూ రెడ్డి కూడా హుందాగానే స్పందించింది. ఇదిలా ఉంటే.. తాజాగా అషూ రెడ్డి తన అభిమానులతో కలిసి ముచ్చట్లు పెట్టింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వచ్చింది. అయితే సాధారణంగా చాలా మంది సెలబ్రెటీల ఫోన్ నంబర్స్ అడుగుతుంటారు.
కానీ ఇక్కడ మాత్రం ఓ నెటిజన్ ఏకంగా తన ఫోన్ నంబర్ పంపి.. అక్కా నీతో మాట్లాడాలని ఉంది కాల్ చేయ్ అని మేసేజ్ పెట్టాడు. దీనికి అషూరెడ్డ తల పట్టుకున్నట్లుగా ఫోటో పెట్టి రిప్లై ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. అషూ షేర్ చేసిన ఫోటోలో సదరు నెటిజన్ ఫోన్ నంబర్ కనిపించింది. ఇంకేముంది అషూ రెడ్డి ఫాలోవర్స్ మొత్తం ఆ నెటిజన్ కు ఫోన్ చేశారట. దెబ్బకు దిగివచ్చిన నెటిజన్.. ఆ పోస్ట్ డెలిట్ చేయ్ అక్కా అంటూ దండం పెట్టి మరీ వేడుకున్నాడు. ఇందుకు అషూ ఎంజాయ్ చేయ్ అంటూ కూల్ రిప్లై ఇచ్చింది.
View this post on Instagram
Also Read: Shankar’s daughter: మెగా హీరో సినిమా కోసం పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు…
Salaar : సలార్ సినిమా ఓటీటీ ఆఫర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. ఏ సౌత్ సినిమాకు దక్కని రికార్డ్ ఇది..
Shilpa Shetty: రూ. కోట్ల విలువైన ఆస్తులను శిల్పాకు ట్రాన్స్‌ఫర్ చేసిన రాజ్‌కుంద్రా.. అదే కారణమంటూ..