Shankar’s daughter: మెగా హీరో సినిమా కోసం పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు…

సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అంటే టక్కున చెప్పే పేరు శంకర్. ఇప్పటి  వరకు భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.  

Shankar's daughter: మెగా హీరో సినిమా కోసం పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు...
Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2022 | 11:02 PM

Shankar’s daughter: సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ అంటే టక్కున చెప్పే పేరు శంకర్. ఇప్పటి  వరకు భారీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో ఈ సినిమా 15 మూవీ. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాతోపాటు కమల్ హాసన్ తో  భారతీయుడు 2 సినిమా చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అనుకోని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటితోపాటు బాలీవుడ్ ,స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో సినిమా చేస్తున్నారు శంకర్. తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన అపరిచితుడు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతుంది.

ఇదిలా ఉంటే శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇప్పుడు సింగర్ గా అవతారమెత్తనున్నారని తెలుస్తుంది. అది కూడా మెగా హీరో సినిమా కోసం. మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా గని. ఈ సినిమా మార్చి 4న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ సాయి మంజేకర్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. . ఇప్పటికే సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ సాంగ్ ను శంకర్ కుమార్ కుమార్తె ఐశ్వర్య ఓ పాట పాడారట. ఈనెల 8వ తారీకున విడుదల కాబోతున్న ‘గని’ రోమియో జూలియట్ సాంగ్ చాలా స్పెషల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ పాటను అదితి శంకర్ ఆలపించారని తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి :

PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు

Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..