AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar : సలార్ సినిమా ఓటీటీ ఆఫర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. ఏ సౌత్ సినిమాకు దక్కని రికార్డ్ ఇది..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలను ప్లాన్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.

Salaar : సలార్ సినిమా ఓటీటీ ఆఫర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. ఏ సౌత్ సినిమాకు దక్కని రికార్డ్ ఇది..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Feb 05, 2022 | 10:35 PM

Share

Salaar : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలను ప్లాన్ చేసి ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాను కంప్లీట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ (Radhe Shyam) సినిమాను ప్రభాస్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కరోనా, ఓమిక్రాన్ కారణంగా వాయిదా పడింది. ఇక కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కేజీఎఫ్2 సినిమా చేస్తున్నారు. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తయ్యింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

ఇక ప్రశాంత్నీల్ దర్శకత్వలో ప్రభాస్ సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ సినిమా పై ఉన్న బజ్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు నెలకొలిపే అవకాశలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసేందుకు పలు ప్రముఖ ఓటీటీ లు పోటీ పడుతున్నాయని తెలుస్తున్నాయి. తెలుగు.. తమిళం.. కన్నడం.. మలయాళం మరియు హిందీ భాషలతో పాటు ఇంకా కొన్ని ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు గాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా సలార్ సినిమాకు ఏకంగా 200కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. నిర్మాతలు దాదాపుగా సలార్ కోసం 300 కోట్ల వరకు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతుంది . ప్రభాస్ రెమ్యునరేషన్ దాదాపు 100 కోట్లవరకు ఉందని టాక్. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

PM Modi: తెలుగు సినిమాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. పీఎం మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Ramakrishna: అంతా ఒట్టిదే తూచ్.. జోక్ చేశా అంటున్న నటుడు.. మండిపడుతున్న నెటిజన్లు

Ravi Teja: ఖిలాడీతో బాలీవుడ్ లో అడుగు పెట్టనున్న మాస్ మహారాజా రవితేజ.. హిందీ ప్రేక్షకులను కూడా నవ్విస్తాడంటున్న నిర్మాతలు..

Follow Us
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు
అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు
కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు
కృష్ణా జలాలు చేరడంతో నీట మునిగిన గ్రామాలు
సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 హెడ్‌ఫోన్స్.. పూర్తి వివరాలివే
సోనీ డబ్ల్యూహెచ్-1000ఎక్స్ఎమ్5 హెడ్‌ఫోన్స్.. పూర్తి వివరాలివే