Mahesh Babu: శంకర్‌కు మహేష్ క్షమాపణాలు చెప్పిన వేళ.. ఆహా అన్‌స్టాపబుల్‌లో ప్రిన్స్ ఆసక్తికర విషయాలు..
Mahesh Babu: ఓటీటీలో టాక్‌షోతో సరికొత్త ఒరవడిని సృష్టించిన తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా.. నిర్వహించిన టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. తొలిసారి బాలకృష్ణ హోస్ట్‌గా మారి సెలబ్రిటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు...
Mahesh Babu: ఓటీటీలో టాక్‌షోతో సరికొత్త ఒరవడిని సృష్టించిన తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా.. నిర్వహించిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. తొలిసారి బాలకృష్ణ హోస్ట్‌గా మారి సెలబ్రిటీలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అత్యధిక వ్యూస్‌తో సరికొత్త రికార్డు సృష్టించిన ఈ టాక్ షో తొలి సీజన్ తాజాగా ముగిసింది. చివరి ఎపిసోడ్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బాలయ్య అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మహేష్.
ఈ క్రమంలో షో మధ్య బాలకృష్ణ దర్శకుడు మెహర్ రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మెహర్ రమేశ్ ముంబయిలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేస్తూ.. ‘ముంబయి మారిటన్ హోట్‌లో ఓ సారి నేను, మహేష్ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాం. అదే సమయంలో ఇద్దరు అమ్మాయిలు వచ్చి, మహేష్‌ను సెల్ఫీ అడిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మహేష్ చెబుతారు’ అంటూ మెహర్ రమేష్ ఫోన్ కాల్ కట్ చేశారు. ఇక ఆ తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగిందో మహేష్ తెలుపుతూ.. ‘హోటల్‌లో ఉన్న సమయంలో. అక్కడో ఫ్యామిలీ ఉంది.. అందులో ఓ ఇద్దరు అమ్మాయిలు వచ్చి సెల్ఫీ అడిగారు. ఫ్యామిలీతో ఉన్నాను, ఇప్పుడు కాదు అని చెప్పాను.
దీంతో ఆ అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే మెహర్ రమేష్ స్పందిస్తూ.. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో కాదు, శంకర్ కూతుళ్లని తెలిపారు. దీంతో వెంటనే కిందకు వెళ్లి, సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. దానికి శంకర్ స్పందిస్తూ.. ‘పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా’ అనిచెప్పుకొచ్చారు. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు మహేష్ ప్రస్తావించడంతో ఇప్పుడీ న్యూస్ కాస్త వైరల్‌గా మారింది.
Also Read: Andhra Pradesh: సత్తా లేని నాయకుడు అంటూ.. మాజీ సీఎం సోదరుడిపై ఎంపీ ఫైర్..
చిన్న చెక్క ఇల్లు.. అమ్మితే కోట్లు వచ్చాయి !! ఎందుకో తెలుసా ?? వీడియో