Naga Chaitanya: ఈ ఏడాదిలోనే నాగచైతన్య తొలి వెబ్ సిరీస్.. టైటిల్ ఇదేనంటూ..
Naga Chaitanya: వెంకీమామ తర్వాత సుమారు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన అక్కినేని నటవారసుడు నాగచైతన్య.. 2021లో వచ్చిన లవ్‌స్టోరీ చిత్రంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా చైతన్యకు..
Naga Chaitanya: వెంకీమామ తర్వాత సుమారు రెండేళ్లు గ్యాప్ ఇచ్చిన అక్కినేని నటవారసుడు నాగచైతన్య.. 2021లో వచ్చిన లవ్‌స్టోరీ చిత్రంలో మంచి విజయాన్ని అందుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా చైతన్యకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు రూపంలో మరో గ్రాండ్ సక్సెస్‌ను అందుకున్నారు. కరోనా సమయంలోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా వరుసగా రెండు సినిమాలు విజయాన్ని అందుకోవడంతో నాగచైతన్య వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే థ్యాంక్యూ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా, హిందీలో లాల్ సింగ్ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న నాగ చైతన్య, మరోవైపు డిజిటల్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాడు. నాగచైతన్య వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను హర్రర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించేందుకు రానుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్‌లతో 3 సీజన్‌లుగా తెరకెక్కించేందుకు విక్రమ్ ప్లాన్ వేస్తున్నారు.
ఇక ఇందులో నాగచైతన్య రెండు డిఫ్రెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి సిల్వర్ స్క్రీన్‌పై లవర్ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చై, డిజిటల్ స్క్రీన్‌పై ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read: Andhra Pradesh : ఉద్యోగ సంఘాలతో ప్రభత్వ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
Andhra Pradesh: కీచక పాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో పోలీసుల చేతికి కీలక ఆధారాలు..