AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..

యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shoban) హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు.

Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..
Santhosh Shoban
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2022 | 7:54 AM

Share

యంగ్ హీరో సంతోష్ శోభన్ (Santhosh Shoban) హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే మంచి రోజులు వచ్చాయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు సంతోష్. ఇప్పుడు ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రేమ్ కుమార్ (Prem Kumar). ఈ చిత్రాన్ని ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై సరళ పన్నీరు సమర్పణలో శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సంతోష్ సరసన రాశీ సింగ్ హీరోయిన్‏గా నటిస్తోంది. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నీలాంబరి పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

‘నీలాంబరం… చూసి నీ కళ్ళలో!.. మేఘామృతం… జారే నా గుండెలో!.. మాటలని మోయలేని పెదవే… మౌనంగా నిన్ను సాయమడిగే… పదే పదే… మనోహరంగా!.. తదేకమే యధావిధంగానీ.. పైనే ఆశ…’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం… ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సందర్భంగా.. నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ “ఈ రోజు విడుదల చేసిన ‘నీలాంబరం’ పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. మంచి మెలోడీ అని శ్రోతలు చెబుతున్నారు. త్వరలో మిగతా పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇదొక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.

Also Read: Shankar’s daughter: మెగా హీరో సినిమా కోసం పాట పాడిన టాప్ డైరెక్టర్ శంకర్ కూతురు…

Salaar : సలార్ సినిమా ఓటీటీ ఆఫర్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే.. ఏ సౌత్ సినిమాకు దక్కని రికార్డ్ ఇది..

Shilpa Shetty: రూ. కోట్ల విలువైన ఆస్తులను శిల్పాకు ట్రాన్స్‌ఫర్‌ చేసిన రాజ్‌కుంద్రా.. అదే కారణమంటూ..