Viral Video: తొండంతో పెయింటింగ్ వేస్తోన్న ఏనుగు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!

పెయింటింగ్ వేయడం అంటేనే కష్టమైన పని. కానీ కొంతమంది కళాత్మకత కలిగిన వారు ఎలాంటి పెయింటింగ్ అయినా...

Viral Video: తొండంతో పెయింటింగ్ వేస్తోన్న ఏనుగు.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. చూస్తే ఆశ్చర్యపోతారంటే!
Elephant
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 06, 2022 | 8:44 AM

పెయింటింగ్ వేయడం అంటేనే కష్టమైన పని. కానీ కొంతమంది కళాత్మకత కలిగిన వారు ఎలాంటి పెయింటింగ్ అయినా కూడా ఈజీగా వేస్తారు. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. మీరెప్పుడైనా ఓ జంతువు పెయింటింగ్ వేయడం చూశారా.? అది కూడా ఏనుగు వేస్తే ఎలా ఉంటుంది..! పెయింటింగ్ ఏంటి.? ఏనుగు వేయడం ఏంటని అనుకుంటున్నారా.? తాజాగా ఓ ఏనుగు పెయింటింగ్ వేసే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం పదండి.!

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఏనుగు తన తొండంతో బ్రష్ పట్టుకుని.. పెయింటింగ్ బోర్డుపై ఏనుగు బొమ్మను గీస్తున్నట్లు మీరు చూడవచ్చు. ప్రొఫెషనల్ పెయింటర్లకు ఏమాత్రం తీసిపోనట్లుగా ఆ చిత్రాన్ని అద్భుతంగా గీస్తుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వైరల్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ అంగుసామి తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా నేతిజన్లతో పంచుకున్నాడు. ఆర్టికల్ రాసేవరకు ఈ 45 సెకన్ల నిడివి గల వీడియోకు 141.8k పైగా వ్యూస్, 8,420 లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలతో స్పందిస్తున్నారు. కొంతమంది ‘ఏనుగుకు శిక్షణ ఇచ్చి ఉంటారని’ కామెంట్ చేయగా.. మరికొందరు ‘ట్రైనర్స్ ఏనుగును ఎంత కష్టపెడితే ఇలా ఇబ్బంది పడుతూ పెయింటింగ్ వేస్తుందని’ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇవి చదవండి:

Viral Photo: తగ్గేదే..లే! మీరు ఈ ఫోటోలోని పామును కనిపెడితే గ్రేటే.. అంత ఈజీ కాదండోయ్!

Viral Photo: అందంలో అప్సరస.. కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టారా.?

భార్యతో కలిసి హోటల్‌కు వెళ్ళిన వ్యక్తి.. ఆరా తీయగా ఫ్యూజులౌట్.. శృంగార యాత్రల గుట్టురట్టు..