Srivalli Song: శ్రీవల్లి సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ వచ్చేసింది.. అదుర్స్ అంటున్న నెటిజన్స్.. మీరు వినేయండి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప (Pushpa).
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప (Pushpa). ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది డిసెంబర్ నెలలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్.. పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. ఏకంగా ప్రపంచవ్యాప్తంగా స్టార్ అయ్యాడు. ముఖ్యంగా ఇందులోని పుష్ప రాజ్ పాత్రలకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఇక పుష్ప పాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. పుష్ప పాటలన్ని నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఊ అంటావా మావ.. ఊహు అంటావా, శ్రీవల్లి, సామి సామి పాటల క్రేజ్ ఇంకా చెప్పాల్సిన పనిలేదు.
ఇక శ్రీవల్లి పాటకు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు సైతం స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు శ్రీవల్లి సాంగ్ ఇంగ్లీష్ వెర్షన్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇంగ్లీష్ గాయని ఎమ్మా హీస్టర్స్ శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్‌ను రికార్డ్ చేశారు. ఈ విషయాన్ని దేవీ శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతాలా ద్వారా తెలియజేస్తూ.. ఎమ్మా హీస్టర్స్ పాడిన పాటను షేర్ చేశారు. ” ఇది బాగా నచ్చింది. హే సిధ్ శ్రీరామ్ బ్రో.. మనం రికార్డ్ చేసినప్పుడు నేను మీకు చెప్పాను ఇంగ్లీష్ వెర్షన్ 4 ఫన్నీగా చెద్దామని. కానీ ఇక్కడ ఎమ్మా హీస్టర్స్ అందంగా పాడారు. మేము ప్రయత్నిస్తే మా మార్పు చేర్పుల్ని కూడా చేస్తాం” అంటూ రాసుకోచ్చారు దేవీ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో శ్రీవల్లి పాటను సిధ్ శ్రీరామ్ పాడగా.. హిందీలో జావేద్ అలీ ఆలపించారు.
శ్రీవల్లి ఆంగ్ల వెర్షన్ విన్న నెటిజన్స్ అదురిపోయిందని… వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించారు. ఇక పుష్ప.. ది రూల్ సెకండ్ పార్ట్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ చేయనున్నారు.
Loved this?❤️?
Hey @sidsriram bro,I told U when we recorded,lets do an English version 4 Fun,but here’s a lovely cover by @emmaheesters ???
May be we shud do our version too? @alluarjun @aryasukku @javedali4u @boselyricist @adityamusic @TSeries https://t.co/9K3qAD4o1H
— DEVI SRI PRASAD (@ThisIsDSP) February 5, 2022
Also Read: Prem Kumar: నీలాంబరి అంటూ వచ్చేసిన సంతోష్ శోభన్.. ప్రేమ్ కుమార్ కలల సుందరి ఎవరంటే..
Eesha Rebba: ఇంత హాట్‌గా ఎలా తయారయ్యావ్?.. ఈషా నేచురల్ ఫొటోపై యంగ్ హీరోయిన్ నాటీ కామెంట్..