AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం సంతోషం.. పోలీసులపై సినీ ప్రముఖుల ప్రశంసలు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నాం.. ఇమ్మడి రవిపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి.. అతని హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలున్నాయి.. ఆయన దగ్గర 50 లక్షల మంది డేటా ఉంది. 20 కోట్లు సంపాదించాడు.. అందులోనే రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామని.. పైరసీ భూతం ప్రపంచాన్ని వణికిస్తుందంటూ.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు..

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం సంతోషం.. పోలీసులపై సినీ ప్రముఖుల ప్రశంసలు
Tollywood
Rajeev Rayala
|

Updated on: Nov 17, 2025 | 12:45 PM

Share

టాలీవుడ్ ను షేక్ చేసిన ఐబొమ్మ సైట్ యజమాని రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాలను పైరసీ చేసి తన సైట్ లో అప్లోడ్ చేయడంతో ఇమ్మడి రవిపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి.. అతని హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలున్నాయి.. ఆయన దగ్గర 50 లక్షల మంది డేటా ఉంది. 20 కోట్లు సంపాదించాడు.. అందులోనే రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామని..  పోలీసులు తెలిపారు. తాజాగా సోమవారం సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ సజ్జనార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం పై సినీ పరిశ్రమ రియాక్ట్ అయ్యింది

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం సంతోషం కలిగించిందని  మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఇందులో భాగస్వాములైన పోలీసులకు ధన్యవాదాలు. పెద్ద సినిమాలతో తెలుగుఖ్యాతి ఖండాంతరాలకు వెళ్తోంది. పైరసీ అనేది సినీ పరిశ్రమకు ఛాలెంజింగ్‌గా మారింది. సినిమాను నమ్ముకొని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పైరసీపై యుద్ధం జరుగుతూనే ఉండాలి అని చిరంజీవి అన్నారు. అలాగే రాజమౌళి మాట్లాడుతూ..  ఐబొమ్మ రవి అరెస్ట్ ఒక సినిమా సీన్‌లా ఉందన్నారు. రవి అరెస్ట్‌లో పోలీసుల చొరవకు ధన్యవాదాలు తెలిపారురాజమౌళి.

అదేవిధంగా హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు నిర్మాత దిల్ రాజు. పైరసీపై కేంద్రం కూడా చట్టాలు తీసుకురాబోతోంది. పైరసీ సినిమాలు చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. కొత్తసినిమాలు 4 వారాల్లో OTTలోకి వస్తాయి అని దిల్‌రాజు తెలిపారు.  అదేవిధంగా నాగార్జున మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మా కుటుంబంలో ఒకరు డిజిటల్‌ అరెస్ట్‌కు గురయ్యారు. పోలీసులను ఆశ్రయిస్తే సమస్య పరిష్కరించారు. కానీ వాళ్లను ట్రేస్‌ చేయలేకపోయాం అని నాగార్జున చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.