IBOMMA Ravi: ఐబొమ్మ రవి హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు.. పోలీసులపై మీమ్స్ చేస్తే తాటతీస్తాం: సీపీ సజ్జనార్ వార్నింగ్
నీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ సజ్జనార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్మడి రవి దగ్గర బాలీవుడ్, హాలీవుడ్, టాలివుడ్ అన్ని సినిమాలు ఉన్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రజల డేటా డార్క్ వెబ్‌లో ఉంటుంది.. ఎవరూ కూడా పైరసీ వెబ్సైట్ చూడవద్దంటూ సజ్జనార్ కోరారు.

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకున్నాం.. ఇమ్మడి రవిపై నాలుగు కేసులు నమోదు అయ్యాయి.. అతని హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలున్నాయి.. ఆయన దగ్గర 50 లక్షల మంది డేటా ఉంది. 20 కోట్లు సంపాదించాడు.. అందులోనే రవి నుంచి 3 కోట్లు స్వాధీనం చేసుకున్నామని.. పైరసీ భూతం ప్రపంచాన్ని వణికిస్తుందంటూ.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.. సోమవారం సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించిన సీపీ సజ్జనార్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్మడి రవి దగ్గర బాలీవుడ్, హాలీవుడ్, టాలివుడ్ అన్ని సినిమాలు ఉన్నాయని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రజల డేటా డార్క్ వెబ్‌లో ఉంటుంది.. ఎవరూ కూడా పైరసీ వెబ్సైట్ చూడవద్దంటూ సజ్జనార్ కోరారు. ప్రజల డేటా దుర్వినియోగం అవుతుంది.. ఈడి ఐటీకి కూడా దీని మీద లేఖలు రాస్తామన్నారు.
ఓజీ, కాంతారా, మిరాయ్, డ్యూడ్ సినిమాలు లేటెస్ట్ గా పైరసీ చేశాడని సజ్జనార్ తెలిపారు. రవి ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారని.. పేర్లు మార్చుకుని రాష్ట్రాలు తిరుగుతాడని సజ్జనార్ తెలిపారు. ఇండియన్ పౌరసత్వం ఉన్నప్పటికీ కరెబియన్ లోని Saint Kitts and Nevis సిటిజన్షిప్ తీసుకున్నాడన్నారు. 110 వెబ్సైట్ డొమైన్స్ ను కొనుగోలు చేశాడని.. ఒక్క డొమైన్ ను బ్లాక్ చేస్తే మరో డొమెయిన్ ద్వారా పైరసీ నడిపిస్తున్నాడన్నారు. అంతేకాకుండా రవి టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా పైరసీ రాకెట్ నడిపాడన్నారు. 2019 నుండి ఫిలిం పైరసీ నడిపించాడని.. ఒక వైపు పైరసీ మరో వైపు ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రోత్సహించాడన్నారు.
తన వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ వైపు యూజర్లు ఆకర్షిస్తులు అయ్యేలా చేశాడని సజ్జనార్ వివరించారు. సినిమా కోసం లింక్ క్లిక్ చేస్తే బెట్టింగ్ సైట్ ఓపెన్ అయ్యేదన్నారు. బెట్టింగ్ వల్ల 1000 కోట్లు ప్రజలు నష్ట పోయి ఉంటారు.. Onewin, 1xbet సైట్ లను IBOmMA ద్వారా ప్రమోట్ చేశాడని.. రవిని అరెస్టు చేసిన తరువాత IBOMMa, bappam సర్వర్లు బ్లాక్ చేశామని తెలిపారు. ప్రజలు పైరసీ వెబ్సైట్ ను చూడవద్దు.. మీ డేటా అంతా దుర్వినియోగం అవుతుందంటూ సజ్జనార్ సూచించారు.
దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరాడు.. పట్టుకుని జైలులో వేశామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఐబొమ్మ రవి పేరుపై 35 బ్యాంక్ అకౌంట్‌లున్నాయని తెలిపారు. రవి అరెస్ట్ తర్వాత కొందరు పోలీసులపై మీమ్స్ చేశారు.. పోలీసులపై మీమ్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ సజ్జనార్ స్పష్టంచేశారు.
