AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad landslide: వయనాడ్‌ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సినీ తారలు..

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 270 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు లక్షల రూపాయలు విరాళంగా అందజేసి బాధితులకు సహాయం చేస్తున్నారు.

Wayanad landslide: వయనాడ్‌ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సినీ తారలు..
Wayanad Landslide
Rajeev Rayala
|

Updated on: Aug 02, 2024 | 10:30 AM

Share

వయనాడ్ విషాదంతో యావత్ దేశం వణికిపోతోంది. కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 270 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తుపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు లక్షల రూపాయలు విరాళంగా అందజేసి బాధితులకు సహాయం చేస్తున్నారు. వయనాడ్‌ బాధితులను ఆదుకునేందుకు..

ఇది కూడా చదవండి : నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

ప్రముఖ తమిళ సినీ నటుడు సూర్య కుటుంబం వయనాడ్ బాధితుల సహాయార్థం రూ. 50 లక్షల రూపాయలను విరాళంగా అందించింది. అలాగే సూర్య భార్య జ్యోతికతో పాటు సూర్య సోదరుడు కార్తీ చేతులు కలిపారు. సూర్య, జ్యోతిక, కార్తీలను ప్రజలు అభినందిస్తున్నారు. ఈ మొత్తాన్ని సూర్య కుటుంబం సీఎం సహాయ నిధికి అందించింది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వయనాడ్ బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించి మంచి మనసు చాటుకుంది. అలాగే కోలీవుడ్ స్టార్ నటుడు విక్రమ్ కూడా 20 లక్షల రూపాయలు అందించారు.

ఇది కూడా చదవండి : Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

ప్రముఖ మలయాళ సినీ నటుడు మమ్ముట్టి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందించారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. మమ్ముట్టి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ట్రస్ట్ ముందుకొచ్చింది. బాధితులకు అవసరమైన ఆహారం, మందులు, బట్టలు తదితరాలను కూడా అందజేస్తున్నారు. రూ. 25 లక్షల రూపాయలు ఇస్తానని మాలీవుడ్‌కు చెందిన ఫహద్ ఫాసిల్, అతని భార్య నజ్రియా నజీమ్ ప్రకటించారు. ఈ విపత్తులో  ఇప్పటికే వేలాది మందిని రక్షించారు. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా వయినాడ్ బాధితులను ఆడుకుందుకు ముందుకు వస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.