Pallavi Prashanth: నిరుపేద కుటుంబానికి బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ సాయం..

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు రైతు దాదువాయి పరమేశ్వర్.. కాగా ఇతని భార్య శంకరమ్మ, ముగ్గురు కుమార్తెలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ గురువారం చిన్న శంకరంపేట‌లోని వారి నివాసానికి వెళ్లి రూ. 20వేలు అందజేశారు.. కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జూన్ 5వ తేదీన పరమేశ్వర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..

Follow us
P Shivteja

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 02, 2024 | 4:25 PM

బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ ఓ నిరుపేద కుటుంబానికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు.. ఇటీవలే పరమేశ్వర్ అనే రైతు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబాన్ని ఆర్ధిక సహాయం చేసి వారికి బాసటగా నిలిచారు పల్లవి ప్రశాంత్.. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడ్డారు రైతు దాదువాయి పరమేశ్వర్.. కాగా ఇతని భార్య శంకరమ్మ, ముగ్గురు కుమార్తెలు పడుతున్న కష్టాలను తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ గురువారం చిన్న శంకరంపేట‌లోని వారి నివాసానికి వెళ్లి రూ. 20వేలు అందజేశారు.. కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జూన్ 5వ తేదీన పరమేశ్వర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. పరమేశ్వర్ కి 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సహాయం చేసిన పల్లవి ప్రశాంత్‌కు పరమేశ్వర్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.